పంచాయతీల భవిష్యత్తు ఏమిటి జగనన్నా అంటున్న సర్పంచ్ లు

జగన్ అన్నే మా భవిష్యత్తు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ….నాలుగు సంవత్సరాలగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్( Jagan ) ను ప్రజలు ఏ రకంగా నమ్ముతారని ప్రతిపక్షాలు హడావిడి చేస్తున్నాయి ….

 Own Surpanch Attack On Government , Chief Secretary Pagadala Ramesh, Jagan , Ys-TeluguStop.com

మాకు నమ్మకం లేదు జగన్ మా నమ్మకం పవన్ అంటూ జనసైనికులు కూడా మరొక పక్క పోటాపోటీ గా స్టిక్కర్ల రాజకీయం లో పాలు పంచుకుంటున్నారు ….ప్రతిపక్షాల విమర్శలు మాట ఎలా ఉన్నా సొంత పార్టీ సర్పంచ్లు ఇప్పుడు అధికార పార్టీ మీద గొంతెత్తడం ఆసక్తికరంగా మారింది.

Telugu Central, Jagan, Surpanch Attack, Ysrajasekhar-Telugu Political News

సోమవారం విజయవాడలో జరిగిన ఉమ్మడి కృష్ణ జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్ ( Chief Secretary Pagadala Ramesh )మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరు మీద ఆవేదన వ్యక్తం చేశారు… రాష్ట్రంలో మూడొంతుల మంది అధికారి పార్టీ సర్పంచులేనని అయితే ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించడానికి సిగ్గుపడుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు… సొంత ఆస్తులు తాకట్టు పెట్టి సచివాలయ భవనాలు రైతు భరోసా కేంద్రాలు కట్టామని కానీ ఇప్పటివరకు బిల్లులు మంజూరు చేయలేదని మరి ఏ ముఖం పెట్టుకొని గడపగడపకు తిరుగుతామని ఆయన ఆవేదన వ్యక చేశారు .అప్పులు ఇచ్చిన వారి వేదింపులతో ఆత్మ హత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయని , వైఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) మీద అభిమానంతో జగన్ ను నమ్మినందుకు ఇప్పుడు మా చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటున్నాం అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సమస్యలు చెప్పుకుంటుంటే కేసులు పెడుతున్నారని సమాంతర వ్యవస్థలను ఏర్పాటు చేసి పంచాయతీల ఉసురుతీసారని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.పంచాయతీరాజ్ చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు ఇచ్చిన రెండు వేల కోట్లకు పైగా నిధులు ఏమయ్యాయి అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు ఒకపక్క ప్రజల్ని ఆకట్టుకోవాలని ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరంగా చేస్తుండగా స్వంత పార్టీ నేతలు ఎదురు తిరుగుతుండటం పార్టీకిమింగుడు పడే వ్యవహారం కాదు .మరి ఈ విషయం లో అధికార పార్టీ స్పందన ఏమిటో చూడాలి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube