కర్నాటక 22 వ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య( Siddaramaiah ) నేడు ప్రమాణ స్వీకారం చేశారు.ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో ఘన విజయం సాధించి ఏకపక్షంగా ప్రభుత్వాని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ముఖ్యమంత్రిని ఎన్నుకునే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం( Congress ) గత నాలుగైదు రోజులుగా తీవ్రంగా తర్జనభర్జన పడి చివరకు సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా ప్రకటించింది.ఇక నేడు సిద్దరామయ్య సిఎం గా ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటి సిఎం గా డికె శివకుమార్( DK Sivakumar ) ప్రమాణ స్వీకారం చేశారు.
కర్నాటక రాష్ట్ర రాజకీయాల్లో సిద్దిరామయ్య కు ప్రత్యక స్థానం ఉంది.

రైతు కుటుంబంలో జనించిన సిద్దిరామయ్య 1983 లో భారతీయ లోక్ దళ్ పార్టీ నుంచి మొదటి సారి పోటీ చేసి గెలుపొందారు.ఆ తరువాత రాజకీయాల్లో తన మార్క్ చూపిస్తూ అంచెలంచేలుగా ఎదిగారు.2013లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో సిద్దిరామయ్య ను మొదటిసారి సిఎం పదవి వరించింది.ఇప్పటివరకు కర్నాటకలో ఆదేళ్లు పూర్తి స్థాయిలో సిఎం పదవిలో కొనసాగిన ఘనత ఒక్క సిద్దిరామయ్యకె దక్కుతుంది.2013 నుంచి 2018 వరకు ఆయన సిఎం పదవిలో కొనసాగారు.అవినీతి రహిత పాలకుడిగా ప్రజల్లో సిద్దరామయ్యకు మంచి పేరు ఉంది.అందువల్ల మరోసారి కాంగ్రెస్ అధిష్టానం సిద్దరామయ్యకే సిఎం పదవిని కట్టబెట్టింది.అయితే సిఎం గా బాద్యతలు చేపట్టిన సిద్దిరామయ్య ముందు చాలానే సవాళ్ళు ఉన్నాయి.

ముఖ్యంగా మేనిఫెస్టో లో కాంగ్రెస్ ప్రకటించిన సిద్దిరామయ్య ఎలా అమలు చేస్తారనేది ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్న అంశం.యువత కు నిరుద్యోగ భృతి, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్, గృహాలక్ష్మి పేరుతో మహిళలకు రూ.2000 వేలు.ఇలా చాలానే అంశాలు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రస్తావించింది.వీటితో పాటు భజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలపై నిషేదం కూడా కాంగ్రెస్ ప్రకటించింది.అయితే ఈ సంస్థల నిషేదం మతపరమైన వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది.మరి వీటిని సిద్దిరామయ్య ఎలా అధిగమిస్తారనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.
మరి ముందు రోజుల్లో సిద్దిరామయ్య తన నిర్ణయాలతో రాష్ట్ర రాజకీయాలను ఎలా మలుపు తిప్పుతారో చూడాలి.







