టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ పాదయాత్ర ప్రారంభించి నెల రోజులు దాటుతోంది.
జనవరి 27న లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.అయితే ఈ పాదయాత్రకు అనుకున్న స్థాయిలో మైలేజ్ రాకపోవడం, ప్రజల నుంచి సరైన స్పందన లేకపోవడం, లోకేష్ ప్రసంగాల కారణంగా ఆయన తరచుగా అభాసుపలవ్వడం వంటివన్నీ టిడిపికి ఇబ్బందికరంగా మారాయి.
ఇదేవిధంగా ఇచ్చాపురం వరకు లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తే పెద్దగా ఉపయోగం ఉండదని, లోకేష్ పాదయాత్ర పై జనాల్లోనూ పెద్దగా చర్చ జరగదనే విషయాన్ని చంద్రబాబు చాలా సీరియస్ గానే తీసుకున్నారు.ఈ మేరకు ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మతో ఈ వ్యవహారంపై చర్చించిన బాబు, యువగళం పాదయాత్రకు మైలేజ్ పెంచే విధంగా ఏం చేస్తే బాగుంటుందనే విషయంపై చర్చించారు.
లోకేష్ పాదయాత్ర కు హైప్ తీసుకొచ్చే విధంగా.సరికొత్త ప్లాన్ కు తెర తీశారట.
ఇప్పటికే టిడిపిలో చేరేందుకు ఎంతమంది నాయకులు రాష్ట్రవ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు .ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కూడా కొద్దిరోజుల ముందు టిడిపిలో చేరారు.ఆయన చేరిక సందర్భంగా లోకేష్ హాజరుకాలేకపోయారు.ఆయన పాదయాత్రలో ఉండడంతోనే చంద్రబాబు సమక్షంలోనే కన్నా లక్ష్మీనారాయణ చేరిపోయారు.ఇకపై లోకేష్ పాదయాత్రలోనే ఈ చేరికలన్ని ఉండేలా చూస్తే.ఆ యాత్రకు మంచి మైలేజ్ వస్తుందని రాబిన్ శర్మ సూచించారట.
లోకేష్ పాదయాత్ర జరిగే నియోజకవర్గాలు, జిల్లాల్లో ఆయా నియోజకవర్గాలు, జిల్లాలకు చెందిన కీలక నాయకులను పార్టీలో చేర్చుకోవాలని , తద్వారా లోకేష్ పాదయాత్రకు మంచి మైలేజ్ తీసుకురావచ్చు అని సూచించారట.అవసరమైతే చంద్రబాబు కూడా ఆ సమయంలో ప్రాధాన్యాన్ని బట్టి వెళ్లాలని నిర్ణయించుకున్నారట.
ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో జరుగుతుంది .దీని తర్వాత అనంతపురం జిల్లాలోకి ఆయన పాదయాత్ర ప్రవేశిస్తుంది అనంతపురం జిల్లాలో కొంతమంది కీలక నేతలు టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట.
2019 ఎన్నికల తరువాత పార్టీని వేడి వెళ్లిన వారు తిరిగి చేరేందుకు సిద్ధమవుతుండడంతో , వీరి చేరికలను పాదయాత్రలో ఉండేలా ప్లాన్ చేశారు .ఇక ఆ తర్వాత కడప, కర్నూలు ,అనంతపురం జిల్లాలో పాదయాత్ర ముగిసిన తర్వాత నెల్లూరు జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుంది ఆ సమయంలోనే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని, అది కూడా లోకేష్ పాదయాత్రలోనే ఈ చేరిక ఉండేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట ఇదేవిధంగా అన్ని జిల్లాల్లోనూ చేరికలను లోకేష్ పాదయాత్రలో ఉండేలా చూసుకుంటే .ఊహించని విధంగా యువ గళం పాదయాత్రకు మంచి మైలేజ్ వస్తుందని బాబు లెక్కలు వేసుకుంటున్నారట.