టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు.ఈయన తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.
శర్వానంద్ ఈ మధ్య మంచి హిట్ అందుకోలేక రేసులో వెనుకబడి పోయాడు.అయితే ఈయన లాస్ట్ సినిమా ఒకే ఒక జీవితం తో మంచి హిట్ అందుకున్నాడు.
ఈ సినిమాతో శర్వానంద్ అందరిని ఎమోషనల్ కు గురి చేసి అందరికి కనెక్ట్ అయ్యాడు.
మరి ఈ సినిమా కంటే ముందు శర్వానంద్ అన్ని రొటీన్ లవ్ స్టోరీలనే చేసేవాడు.
కానీ ఒకే ఒక జీవితం హిట్ తర్వాత ఈయన తన పంథా మార్చుకుని రొటీన్ స్టోరీలను కాకుండా కొత్తగా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.అందుకే కొద్దీ రోజుల గ్యాప్ తర్వాత శర్వానంద్ తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ రోజు శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది.తన 35వ సినిమా అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఈ రోజు వచ్చింది.ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తుండగా.ఈ సినిమా ఒక నవల పాయింట్ తో రాబోయే కాలానికి సంబంధించినదిగా ఉండబోతుందని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది.

చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు శర్వా. ఈ సినిమా త్వరలోనే రెగ్యురల్ షూట్ స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది.పోస్టర్ ను బట్టి ఈ సినిమా లండన్ లొకేషన్ లో చిత్రీకరించ నున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభట్ల కలిసి నిర్మిస్తున్నారు.మరిన్ని వివరాలు త్వరలోనే అందించనున్నట్టు తెలిపారు.







