రేవంత్ ని కాంగ్రెస్ పక్కకి పెట్టేసింది..

కాంగ్రెస్ లో చేరి ఎదో పోడ్చేస్తాను.కేసీఆర్ ని అతలా కుతలం చేస్తాను అని భావించిన ఫైర్ బ్రాండ్ రేవంత్ ఇప్పుడు స్కూల్ పిల్లాడిలా కామ్ గా కూర్చున్నాడు.

 What Is Revanth Situation In Congress..?-TeluguStop.com

కాంగ్రెస్ లోకి వెళ్లి నెలలు గడుస్తున్నా సరే ఇప్పటికీ కాంగ్రెస్ లో తన స్థానం ఏమిటి అనేది తనకి కూడా తెలియకపోవడం ఫైర్ బ్రాండ్ కి ఎంతో అవమానంగా మారింది.ముందు అయితే ఫైర్ బ్రాండ్ ని మన పార్టీలోకి రప్పిస్తే తరువాత విషయం మెల్లగా చూసుకోవచ్చు అని ఆలోచించిన అధిష్టానం.

ఆదిసగానే అడుగులు వేస్తోంది

అయితే ఎంత తొందరగా తనకి పదవి ఇస్తే అంత తొందరగా టీఆరెస్ దాడి మొదలు చేస్తాను అని చెప్తున్నాడు రేవంత్.అయితే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో సామాజిక వర్గాల వారీగా చుస్తే అధ్యక్షుడిగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.

వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన భట్టి విక్రమార్క…అయితే మరోక వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును బీసీ సామాజికవర్గానికి చెందిన మాజీమంత్రి దానం నాగేందర్ కు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.మరి ఈ లెక్కల ప్రకారం చుస్తే టి-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ ఉండడు అనే ప్రచారం కూడా ఒక పక్క జరుగుతోంది

అయితే కాంగ్రెస్ కి ముందు నుంచీ ఒక లావాటు ఉంది ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఒక్క సరి కాంగ్రెస్ లోకి రాగానే కాంగ్రెస్ వారి చెప్పు చేతల్లో ఉండాల్సిందే తప్ప.

ఎవరి నిర్ణయాల మీద ఆధారపడి పని చేయదు కాంగేస్స్.అందుకే రేవంత్ వచ్చీ రాగానే తనని హైప్ చేయకుండా సైలెంట్ చేసి తాము చెప్పేటట్టు రేవంత్ ఆడేలా పప్లాన్ చేస్తున్నారు

అయితే పదవి ఇవ్వడం ఖాయం అని దాని కోసం రేవంత్ ఎదురు చూడాల్సిందే అని.కాంగ్రెస్ సీనియర్స్ అంటున్నారు.మరి రేవంత్ దూకుడుకి ఇప్ప్పుడే కాంగ్రెస్ బ్రేకులు వేస్తుంటే మరి ముందు ముందు ఈ ఫైర్ బ్రాండ్ ఫైర్ అవుతుందా లేక తుస్సు మంటుందా తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube