స్వీగ్గీలో మనం పిజ్జా ఆర్డర్( Pizza order ) చేస్తే రూ.400 ఉంటుంది.అదే జోమాటోలో రూ.350 వరకు ఉంటుంది.అదేవిధంగా బిర్యానీ అయితే క్వాంటిటీని బట్టి రూ.200 నుండి రూ.450 వరకూ ఉంటుంది.ఇలాంటి పరిస్థితులలో తక్కువ ధరలో మనకు కావలసిన ఫుడ్ కావాలంటే ఏమి చేయాలి? అదెలా అని అనుకుంటున్నారా? ఇపుడు దానికి ఓ ఫ్లాట్ ఫారం వుంది.అదే ఓఎన్‌డీసీ( ONDC ) (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్.) ఇపుడు ఫుడ్ విషయంలో డబ్బు ఆదా చేసుకోవడానికి ప్రజలు ఎక్కువగా ఓఎన్‌డీసీపై ఆధారపడటం మొదలు పెట్టారు.
రానున్న రోజుల్లో ఇదొక విప్లవంలాగా మారిపోక తప్పదు.ఓఎన్‌డీసీ అంటే ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేది ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ నెట్‌వర్క్.దీనిపై, స్థానిక, చిన్న వ్యాపారాలు ఒక నెట్‌వర్క్ అప్లికేషన్‌లో భాగం అవుతున్నాయి ఇపుడు.ఇది చిన్న వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి, అలాగే ఈ రంగంలో పెద్ద కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించడానికి సహకరిస్తుంది.
ఓఎన్‌డీసీని బెంగళూరులో( Bangalore ) సెప్టెంబర్ 2022లో తొలిసారిగా స్టార్ట్ చేయగా ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్ చాలా నగరాల్లో అందుబాటులో కలదు.ఇపుడు ప్రజలు ఉత్తమమైన డీల్‌లను పొందడానికి దీనిని ఎక్కువగా వాడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు, ఓఎన్‌డీసీ మధ్య పోలిక ఏమంటే, ఈ ప్లాట్‌ఫారమ్ రెస్టారెంట్ యజమాని నేరుగా కస్టమర్‌కి ఫుడ్‌ను విక్రయించడానికి అనుమతిస్తుంది.అదే స్విగ్గీ, జొమాటో వంటి థర్డ్ పార్టీ యాప్‌ల వలె కాకుండా ఫుడ్ తక్కువ ధరలో అమ్ముతారు.