మీలో ఎవరన్నా క్రెడిట్ కార్డు( Credit card ) వాడుతున్నారా? అదెంత మాట, క్రెడిట్ కార్డు లేనివారు ఎవరన్నా ఇక్కడ వుంటారా? అని అంటారు కదూ.అయితే మీరు ఈ పూర్తి కధనాన్ని చదవాల్సిందే.
మనలో ముఖ్యంగా వర్క్ చేసేవారు, మినిమమ్ సంపాదించేవారు తప్పకుండా క్రెడిట్ కార్డులను వాడుతూ వుంటారు.అవి వాడినప్పుడు బాగానే ఉంటాయి గానీ, బిల్లు కట్టినపుడు మాత్రం వాచిపోతూ ఉంటుంది.
అవును, ఇపుడు మీలాంటివారికే ఈ చేదువార్త.

అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ భారాన్ని సరళీకృత రెమిటెన్స్ స్కీమ్ కిందకు తీసుకు రావడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ, తాజాగా ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద కొన్ని నిబంధనలను సవరించిన సంగతి మీరు వినే వున్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala Sitharaman ) పార్లమెంట్‌లో ఫైనాన్స్ బిల్లు 2023ని పాస్ చేస్తున్నపుడు విదేశీ పర్యటనలపై క్రెడిట్ కార్డ్ చెల్లింపులను ఎల్‌ఆర్‌ఎస్ పరిధిలోకి తీసుకురావడానికి మార్గాలను పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( Reserve Bank of India )ని కోరిన తర్వాత ఈ విధానం తెరమీదకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా విదేశీ మారకపు చెల్లింపులు జూలై 1 నుంచి మూలాధారం (టీసీఎస్) వద్ద 20% పన్ను వసూలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.అయితే ఇప్పటి వరకు సరళీకృత చెల్లింపుల పథకం కింది భారత వెలుపల చేసే చెల్లింపులపై కేవలం 5 శాతం మాత్రమే ట్యాక్స్ విధించేవారు.
ప్రస్తుతం ఈ పన్ను చెల్లింపు విదానంలో మార్పులు చేసిన కేంద్రం దేశ వెలుపల చేసే ఈ చెల్లింపుపై 20 శాతం పన్ను విధించాలని నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు.దీంతో అంతర్జాతీయంగా క్రెడిట్ కార్డులను ఉపయోగించే వినియోగదారులకు పన్ను భారం తప్పదు.







