కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు.ఈ క్రమంలో అవినాశ్ రెడ్డి మద్దతుదారులు కార్యాలయానికి భారీగా చేరుకుంటున్నారు.
దీంతో సీబీఐ ఆఫీస్ వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కాగా ఇప్పటికే అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే.
అయితే ఇవాళ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని ఆయనపై అభియోగం ఉంది.
ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి అరెస్ట్ పై సందిగ్ధత కొనసాగుతోంది.







