కే‌సి‌ఆర్ ప్లానేంటి..ఏం చేయబోతున్నారు ?

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్( CM KCR ) జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన తరువాత.

బి‌ఆర్‌ఎస్ ను( BRS ) దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో నిమగ్నమైన సంగతి తెలిసిందే.

అయితే జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టినది మొదలుకొని ఆయన దృష్టి ప్రధానంగా కర్ణాటకపైనే ఎక్కువగా ఉంది.ఎందుకంటే కర్నాటకలో ఎక్కువగా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండడం.

కర్నాటకలోని బార్డర్ జిల్లాలు ఎక్కువగా తెలంగాణతో సరిహద్దు పంచుకోవడం వంటి కారణాలతో కర్నాటకలో ( Karnataka ) బి‌ఆర్‌ఎస్ త్వరగా బలపడే అవకాశం ఉందని కే‌సి‌ఆర్ మొదటి నుంచి భావిస్తున్నారు.ఇక కర్నాటక మాజీ సి‌ఎం కుమారస్వామి కూడా బి‌ఆర్‌ఎస్ కు మద్దతు తెలపడంతో బి‌ఆర్‌ఎస్ మరియు జేడీఎస్ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు గట్టిగా వినిపించాయి.

ఎట్టకేలకు కర్నాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది.మరిప్పుడు కే‌సి‌ఆర్ ప్లానేంటి ఆనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.కర్నాటక ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పోటీ చేయనుందా ? లేదా జేడీఎస్ కు మద్దతుగా నిలవనుందా ? అనే దానిపై పోలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.ప్రస్తుతం జేడీఎస్ కు 28 స్థానాలు ఉన్నాయి.

Advertisement

వచ్చే ఎన్నికల్లో కూడా జేడీఎస్ కు 28-30 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో ఒకవేళ బి‌ఆర్‌ఎస్ మద్దతిచ్చినప్పటికి కొత్తగా ఆ పార్టీకి ఒరిగేదెమి లేదు.

మరోవైపు జేడీఎస్ తో కలిసిపోటీ చేయడం వల్ల బి‌ఆర్‌ఎస్ కు కూడా అనుకున్నంతా మైలేజ్ వచ్చే అవకాశం కూడా లేదని కొందరి వాదన.ఈ నేపథ్యంలో కే‌సి‌ఆర్ ఒంటరిగానే కర్నాటక ఎన్నికల బరిలో దిగుతారా ? అనే ప్రశ్నలు కూడా తెరపై వ్యక్తమౌతున్నాయి.ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ కాంగ్రెస్ వంటి బలమైన పార్టీల పోటీని తట్టుకొని బి‌ఆర్‌ఎస్ నిలువగలదా ? ఆనేది చెప్పడం కష్టం.కాగా బి‌ఆర్‌ఎస్ జాతీయ పార్టీగా విస్తరించేందుకు కర్నాటక ఎన్నికలతోనే తొలి అడుగు పడే అవకాశం ఉంది.

అందువల్ల కర్నాటక ఎన్నికలను కే‌సి‌ఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది.మరి కర్నాటక ఎన్నికల్లో సత్తా చాటెందుకు కే‌సి‌ఆర్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి.

ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...
Advertisement

తాజా వార్తలు