మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరి రామ జోగయ్య.ఈ మద్యన మళ్లీ పొలిటికల్ హడావిడి చేస్తున్నారు.85 ఏళ్ల వయసులోనూ దీక్షకు దిగి వారెవ్వా అనిపించుకున్నారు. కాపు జాతి కోసం అంటూ.
సీఎం జగన్ కు లేఖ రాశారు.కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తన నివాసం లో దీక్షకు దిగారు.
అయన ఆరోగ్య పరిస్థితి నీ దృష్టిలో ఉంచుకొని అధికారులు.అయన దీక్షను భగ్నం చేస్తూ నే.హాస్పిటల్ కు తరలించారు.అయితే ఈ కురు వృద్దుడు మాత్రం.
హాస్పటల్ లో సైతం దీక్షను విరమించ లేదు.ఇక్కడి దాకా లెక్క బాగానే ఉంది.
అయితే ఇక్కడే జనసేన అధ్యక్షుడు పవన్ రంగం లోకి దిగారు.దాంతో సీన్ మొత్తం మారిపోయింది.
వైసీపీ నేతలు చెప్పినా వినని జోగయ్య.ఒక్క పవన్ ఫోన్ తో దీక్షను విరమించారు.ఇక్కడే అటు వైసీపీ కి ఇటు టీడీపీ కి నిద్ర పట్టడం లేదు.తన తర్వాత కాపుల సంక్షేమం కోసం పని చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఒక మెసేజ్ ను వాళ్ళలోకి చొప్పించారు.
ఒక్క దెబ్బతో కపుల్లో.మరో వంగవీటి మోహన రంగా లా పవన్ ను ఎక్స్పోజ్ చేయడం మొదలు అయింది.
రెండు గోదారి జిల్లాల్లో ప్రభావం చూపగల కాపుల ఓట్లను జోగయ్య.జనాసెన ఖాతాలో వేసేశారు.
దాంతో ఆ పార్టీ నేతల్లో జోష్ పెరిగింది.ఇది కూడా బాగానే ఉన్నా.
ఇక్కడే జనసేనకి ముచ్చెమటలు పడుతున్నాయి.వంగ వీటి రంగా మాదిరి.
పవన్ ను కుల నేతగా మిగతా ప్రజలు చూడటం స్టార్ట్ అయింది.అది రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు పెద్ద మైనస్ గా మారుతోంది.
మరి రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ పొలిటికల్ పార్టీ గా నిలబడుతుందా.? లేక కుల పార్టీగా మిగిలిపోతుంధా.? చూడాలి.