ఇంతకీ బీజేపీ దారెటు ?

ఏపీలో బీజేపీ ఎటు తెలుచుకోలేని పరిస్థితిలో ఉంది.రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న ఆ పార్టీకి ఆ దిశగా సరైన మార్గం కనిపించడం లేదు.

ఎప్పటి నుంచే ఏపీలో బలపడాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ.అయితే స్థానిక పార్టీల ప్రభావం అధికంగా ఉండడంలో బీజేపీ ప్రభావం ఏపీలో చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.

దాంతో ఒంటరిగా సత్తా చాటలేని పరిస్థితి.ఏదో ఒక పార్టీతో జట్టు కడితే తప్పా రాష్ట్రంలో నిలదొక్కుకోలేని స్థితిలో కమలం పార్టీ ఉంది.

అందుకే ప్రస్తుతం జనసేనతో ఆ పార్టీ పొత్తు కొనసాగుతోంది.

Advertisement

మరోవైపు ఏ పార్టీ ఎలా అవసరం ఎప్పుడు ఉంటుందో చెప్పలేము కాబట్టి అటు వైసీపీతోను సన్నిహిత సంబంధాలు బీజేపీ ( BJP )కొనసాగిస్తుందనే వాదన ఉంది.కానీ ఒక్క టీడీపీతో మాత్రమే బీజేపీ విముఖత చూపిస్తోంది.అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలంటే టీడీపీ అండ చాలా అసవరం.

ఇది గ్రహించిన జనసేన టీడీపీతో కూడా దోస్తీ కొనసాగించేందుకు మొగ్గు చూపుతోంది.కానీ బీజేపీ మాత్రం ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది.

ఈ నేపథ్యంలో ఒకవేళ జనసేన టీడీపీతో అధికారికంగా పొత్తు పెట్టుకుంటే బిజెపి వైసీపీతో కలిస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా ఆ కమలనాథులు ఆలోచిస్తున్నారట.

అయితే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం తరచూ వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.కానీ కేంద్ర పెద్దలైన మోడీ, అమిత్ షా( Amit Shah ) వంటి వారు ఇప్పటివరకు జగన్ విమర్శించిన దాఖలాలు లేవు.అటు జగన్ కూడా టీడీపీ,జనసేన పై చూపిస్తున్న ఫైర్ బీజేపీ పై మాత్రం చూపించడం లేదు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?

దీంతో బీజేపీ వైసీపీతో కలుస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.అయితే వైసీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని జగన్ ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు.కానీ రాజకీయాలు ఎప్పుడు ఎలా టర్న్ అవుతాయో చెప్పలేము కాబట్టి బీజేపీ వైసీపీ కలిసిన ఆశ్చర్యం లేదనేది కొందరి మాట.ఒకవేళ ఇది జరగకపోతే జనసేన టీడీపీ తో కలిసి కూటమిగా ఏర్పడడం తప్పా బీజేపీ ముందు వేరే ఆప్షన్ లేదు.మరి కాషాయ పార్టీ దారెటు ఉంటుందో చెప్పడం విశ్లేషకులకు సైతం అంతు చిక్కని ప్రశ్నలా మారింది.

Advertisement

తాజా వార్తలు