ఏపీ ఆర్టీసీ బస్సుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చేస్తున్నారంటే.. ?

కరోనా వల్ల దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్దలు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే.

అందులో రెండు రాష్ట్రాల ఆర్టీసి సంస్దలు తీవ్రమైన నష్ట, కష్టాల్లో కూరుకు పోతున్నాయి.

ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో రోడ్ల మీదే తిరిగే బస్సుల్లోని ప్రయాణికులు ఎంతకని కరోనా రక్షణ చర్యలు తీసుకుంటారు.ఎంత తీసుకున్నా కోవిడ్ సోకే వారికి సోకుతూనే ఉంది.

అలాగని పూర్తిగా బస్సులను బంద్ చేస్తే ప్రయాణికులతో పాటుగా, ఆర్టీసీ సంస్ద కూడా ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుంది.ఈ విషయంలో తీవ్రంగా ఆలోచించినట్లుగా ఉంది ఏపీఎస్ ఆర్టీసీ.

అందుకే ఓ కీలక కీలక నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా బస్సుల్లో సగం సీట్లలోనే ప్రయాణికులను అనుమతించాలని, 50 శాతం సీట్లకే ప్రయాణికులను పరిమితం చేయాలని నిర్ణయించింది.

Advertisement

అదీగాక ముందస్తు రిజర్వేషన్‌ సగం సీట్లకే చేసుకునేలా మార్పులు చేసింది.ఇకపోతే ఆయా డిపోలకు ఈ నిబంధన తక్షణమే అమలు చేయాలని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ ఆదేశాలు జారీ చేశారు.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు