టికెట్ ప్రకటించుకోవడం వెనుక బాలినేని స్కెచ్ ఏంటో..? 

వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni srinivasareddy ) సంచలన ప్రకటన చేశారు.

ఇటీవలే బాలినేని వైసిపి అధిష్టానం పై తన అసంతృప్తిని వెళ్ళగక్కారు.

వెంటనే జగన్ బాలినేనిని పిలిచి బుజ్జగించారు.వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయమై కంగారు పడవద్దని, సర్వేల ద్వారా టిక్కెట్ కేటాయింపులు చేస్తామని జగన్ బాలినేని కి నచ్ఛ చెప్పారు.

అయితే నిన్ననే మీడియా సమావేశం నిర్వహించిన బాలినేని వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని, అలాగే మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించారు.ఇలా ప్రకటించుకోవడం వెనుక కారణాలు ఏమిటి అనేది వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

What Is ,balineni Srinivasareddy, Sketch Behind Announcing The Ticket ,balinen

చాలా కాలంగా జగన్( YS Jagan Mohan Reddy ) తనను పట్టించుకోవడంలేదనే అసంతృప్తితో బాలినేని ఉన్నారు.ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి తనను టార్గెట్ చేసుకుని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని బాలినేని తీవ్ర ఆగ్రహంతో ఉంటున్నారు.సుబ్బారెడ్డి పై అసంతృప్తితో ఆయనకున్న బాధ్యతలు అన్నిటిని వదులుకున్నారు.

Advertisement
What Is ,Balineni Srinivasareddy, Sketch Behind Announcing The Ticket? ,Balinen

గతంలో తన స్థానంలో తన భార్య పోటీ చేయవచ్చని లేదా మరొకరు పోటీ చేయవచ్చని తన కుమారుడికి సీటు ఇవ్వాలని అడిగినట్లుగా రకరకాల చెప్పారు.తనకు కూడా టికెట్ గ్యారెంటీ లేదని  సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక ఇప్పుడు మాత్రం ఒంగోలు అసెంబ్లీ టికెట్ బాలినేని ప్రకటించుకున్నారు.ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి విషయానికొస్తే.

  వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని , తన కుమారుడు పోటీ చేస్తారు అని ప్రకటించారు.

What Is ,balineni Srinivasareddy, Sketch Behind Announcing The Ticket ,balinen

 అయితే మాగుంట రాఘవ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కోవడం, పార్టీ కార్యక్రమాల్లోనూ అంత యాక్టివ్ గా ఉండడం లేదు .అయితే వచ్చే ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ , పార్లమెంట్ నుంచి వీరిద్దరూ పోటీ చేయడం ఖాయాం అయినా,  ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.టిడిపి నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి , మాగుంట శ్రీనివాస్ రెడ్డి( Magunta srinivasareddy ) పోటీ చేసే అవకాశం ఉందని,  అందుకే ముందుగానే వైసీపీ టికెట్ ప్రకటించుకున్నారని, తమను కాదని వేరొకరికి టికెట్ ఇస్తే టిడిపి నుంచి పోటీ చేసే విధంగా రెండు రకాలుగా ఉపయోగపడే విధంగా బాలినేని ఈ ప్రకటన చేశారనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు