కొన్ని సినిమాలు చూసినప్పుడు ఆ సినిమాలో ఆ హీరోలు కాకుండా ఇంకా వేరే హీరోలు ఉంటే సూపర్ గా ఉండేదని సినిమా చూసిన ప్రతి ఒక్క అభిమానికి అనిపిస్తూ ఉంటుంది.ఇక ఇలాంటి క్రమం లోనే తెలుగులో మంచి నటుడుగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్( NTR ) ఎలాంటి పాత్రను అయిన చాలా అలవోకగా చేసి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుడు కావడం విశేషం…ఇక ఈయన తీసిన ప్రతిపాత్ర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటాయి.
అయితే ఈయన ఎక్కువగా మాస్ సినిమాలు చేయడం వల్ల యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్లు చేయలేకపోతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే కన్నడ సినిమాగా వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న ‘కాంతార’ సినిమా( Kantara Movie ) ఒక మనల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్ళింది అనే చెప్పాలి.ఇక నటుడు రిషబ్ శెట్టి ( Rishab Shetty ) అద్భుతంగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.మరి ఇలాంటి క్రమంలో ఆ సినిమాని తెలుగులో కనక రిలీజ్ చేయకుండా దాన్ని ఎన్టీఆర్ తో కనక రీమేక్ చేసి ఉంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేదని తెలుగులో ఇండస్ట్రీ హిట్ గా మారేదని చాలామంది సినీ ప్రముఖుల సైతం వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఆ పాత్రని ఈజీగా చేసేవాడు.ఇక ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలు చేయడంలో ఆయన ఎప్పుడు ముందు ఉంటాడు.కాబట్టి ఒకవేళ ఆ పాత్రను రీమేక్ చేసే అవకాశం వస్తే మాత్రం ఎన్టీఆర్ ఈ పాత్ర ను రీమేక్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉండేదని మొత్తానికైతే అలాంటి ఒక పాత్రని ఎన్టీఆర్ చేస్తే చూడాలని తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు.మరి ఎన్టీయార్ ఫ్యూచర్ లో అలాంటి పాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.