ప్రస్తుత వేసవి కాలంలో ఎక్కడ చూసినా మామిడి పండ్లే కనువిందు చేస్తూ నోరూరిస్తుంటాయి.అదే పల్లెటూర్లలో ఇంటికో మామిడి చెట్టు ఖచ్చితంగా ఉంటుంది.
కేవలం వేసవి కాలంలో మాత్రమే లభించే మామిడి పండ్ల కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉంటానికి కారణం.వాటి రుచే.
దొరగా పండిన మామిడి పండు తింటే ఉంటుందీ.అబ్బబ్బబ్బా స్వర్గమే.
అయితే కొందరు పచ్చి మామిడి కాయలనే తెగ తింటుంటారు.అసలు పచ్చి మామిడి కాయలను తినొచ్చా అంటే.
నిశ్చింతగా తినమనే చెబుతున్నారు.
పైగా పచ్చి మామిడి కాయలను తినడం వల్ల బోలెడు ఆరోగ్య లాభాలను సైతం తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆరోగ్య లాభాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.ప్రస్తుత వేసవి కాలంలో చాలా మంది వడదెబ్బకు గురవుతూ నానా ఇబ్బందులు పడుతుంటారు.అయితే పచ్చి మామిడి కాయను తినడం వల్ల అందులో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు వడదెబ్బ బారిన పడకుండా రక్షిస్తాయి.
అలాగే పచ్చి మామిడి కాయను తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.
దాంతో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.

బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో పచ్చి మామిడి కాయలు సూపర్‌గా హెల్ప్ చేస్తాయి.వీటిని అప్పుడప్పుడు తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుండె సంబంధిత జబ్బులు రాకుండా ఉంటాయి.
అంతేకాదు, పచ్చి మామిడి కాయలను తినడం వల్ల బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
అధిక ఆకలి సమస్య దూరం అవుతుంది.బరువు తగ్గే ప్రాసెస్ వేగవంతం అవుతుంది.
లివర్ సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది.మరియు రోగ నిరోధక వ్యవస్థ సైతం బలపడుతుంది.
అయితే కడుపు నొప్పి ఉన్న సమయంలో మాత్రం పచ్చి మామిడి కాయలను తినకపోవడమే మంచిది.