వ‌ర్షాకాలంలో అర‌టి పండు తినొచ్చా..? తిన‌కూడ‌దా..? తెలుసుకోండి!

అర‌టి పండు.చ‌వక ధ‌ర‌కే ల‌భించిన‌ప్ప‌టికీ అమోఘ‌మైన పోష‌క విలువ‌ల‌ను క‌లిగి ఉండే అద్భుత‌మైన పండు ఇది.

సీజ‌న్‌తో ప‌ని లేకుండా ఏడాది పొడ‌వునా ల‌భించే అర‌టి పండును ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు.అయితే ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో మాత్రం చాలా మంది అర‌టి పండ్ల‌ను ఎవైడ్ చేస్తుంటారు.

ఈ సీజ‌న్‌లో అర‌టి పండ్లు తీసుకుంటే జలుబు, ద‌గ్గు, క‌ఫం, ఆస్త‌మా వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని న‌మ్మ‌డ‌మే అందుకు కార‌ణం.అస‌లింత‌కీ వ‌ర్షాకాలంలో అర‌టి పండ్లు తినొచ్చా.? తిన‌కూడ‌దా.? అంటే పోష‌కాహార నిపుణులు నిశ్చింత‌గా తీసుకోమ‌నే చెబుతున్నారు.అర‌టి పండ్ల‌లో విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్క‌లంగా నిండి ఉంటాయి.

అవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఈ వ‌ర్షాకాలంలో రోజుకు ఒక అర‌టి పండును తీసుకుంటే జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది.

గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.మెదడు పనితీరు, గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.

Advertisement

అలాగే అర‌టి పండులో ఉండే పోష‌కాలు ఇమ్యూనిటీ సిస్ట‌మ్‌ను సూప‌ర్ స్ట్రోంగ్‌గా మారుస్తాయి.ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ మ‌రియు ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్ అవుతాయి.ర‌క్త హీన‌త బారిన ప‌డ‌కుండా ఉంటారు.

ర‌క్త‌పోటు సైతం అదుపులో ఉంటుంది.అయితే ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ.

ఈ సీజ‌న్‌లో అర‌టి పండును తీసుకునేట‌ప్పుడు త‌ప్ప‌కుండా కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి.అలాగే కొంద‌రు వాటిని ఎవైడ్ కూడా చేయాలి.

రోజుకు ఒక అర‌టి పండుకు మించ‌కుండా తీసుకోవాలి.సాయంత్రం పూట, రాత్రి పూట అర‌టి పండ్ల‌ను తినకపోవడం చాలా అంటే చాలా ఉత్త‌మం.అదేవిధంగా ఖాళీ కడుపుతో అరటి పండును తినే అల‌వాటును వ‌దులుకోవాలి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

జ‌లుబు, దగ్గు ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను లిమిట్‌గా తీసుకోవాలి.అదే ఆస్తమా వ్యాధితో ఇబ్బంది ప‌డేవారు మాత్రం అర‌టి పండ్ల‌ను కంప్లీట్‌గా ఎవైడ్ చేయ‌డ‌మే మంచిది.

Advertisement

తాజా వార్తలు