కృష్ణ, శోభన్‌బాబు మధ్య ఏం జరిగింది.. మల్టీస్టారర్ సినిమాలు చేయడం ఎందుకు మానేశారు ?

టాలీవుడ్‌లో ఎన్‌.టి.

రామారావు, అక్కినేని నాగేశ్వరరావులు కలిసి మల్టీస్టారర్‌ మూవీల ట్రెండ్ ప్రారంభించారు.

వీళ్లిద్దరూ కలిసి సుమారు 15 సినిమాల్లో యాక్ట్ చేశారు.

అయినా ఎప్పుడూ వారి మధ్య మనస్పర్థలు రాలేదు.ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ ‘మిస్సమ్మ’లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో లాగానే అన్ని సినిమాల్లో వారు ఒకరికొకరు గౌరవం నేర్చుకున్నారు.

ఇంపార్టెన్స్ కూడా ఇచ్చుకున్నారు.అయితే కె.వి.రెడ్డి( KV Reddy ) తీసిన ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’లో ఎన్టీఆర్‌ శ్రీకృష్ణుడిగా, ఎఎన్నార్‌ అర్జునుడిగా యాక్ట్ చేయడం వల్ల ఏఎన్ఆర్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోయారు.అర్జునుడి పాత్ర కొంచెం సమయం మాత్రమే ఉందని పెద్ద సీన్ క్రియేట్ చేసి, ఎన్టీఆర్-ఏఎన్ఆర్లు 14 ఏళ్లు పాటు సినిమాలు చేయకుండా చేశారు.

Advertisement

వీరి తర్వాత తెలుగులో మళ్లీ మల్టీస్టారర్ మూవీస్ ఎక్కువగా తీసిన వారు సూపర్ స్టార్ కృష్ణ, శోభన్‌బాబు( Superstar Krishna, Shobhan Babu ).శోభన్‌బాబు కృష్ణ కంటే సినిమాల్లోకి నాలుగేళ్ల ముందే వచ్చారు.ఈ కారణంగా కృష్ణ శోభన్‌బాబుకు రెస్పెక్ట్ ఇచ్చేవారు.

వీరిద్దరి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’.వారి కాంబోలో వచ్చిన లాస్ట్ మూవీ ‘మహా సంగ్రామం’.ఈ స్టార్ హీరోలు కలిసి చేసిన సినిమాలు 17.1973 నుంచి కొంతకాలం వరకు వీరి కాంబోలో ఒక సినిమా కూడా రాలేదు.ఈ క్రమంలో ఒకరికొకరు పోటీపడి హిట్ సినిమాలు తీశారు.

వీరికి సపరేటు ఫ్యాన్ అసోసియేషన్స్‌ కూడా ఏర్పడ్డాయి.

నాలుగేళ్ల తర్వాత అంటే 1977లో ‘కురుక్షేత్రం’ సినిమా ( Kurukshetram movie )కోసం మరోసారి కలిసి పని చేశారు.ఈ సినిమాలో శ్రీకృష్ణుడి వేషం శోభన్‌బాబు వేస్తే అర్జునుడి వేషం కృష్ణ వేశారు.మళ్లీ వారి కాంబోలో సినిమాస్ రీస్టార్ట్ అయ్యాయి.

ధనవంతులను ఎలా పెళ్లి చేసుకోవాలో ఐడియాలు ఇస్తూ.. కోట్లు సంపాదిస్తోంది..!
న్యాచురల్ స్టార్ నానికి జోడీగా ఎన్టీఆర్, చరణ్ బ్యూటీ.. ఈ హీరోయిన్ దశ తిరిగిపోతుందిగా!

మరోవైపు వీరి ఇద్దరిలో ఎవరి రోల్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అనే కోణంలో డిస్కషన్ జరిగేవి.శోభన్ బాబు సీనియర్ కాబట్టి అతడి కంటే తనకు తక్కువ ప్రాధాన్యత గల పాత్ర దొరికినా కృష్ణ ఫీల్ అయ్యే వారు కాదు.

Advertisement

కానీ వారి సక్సెస్‌ఫుల్‌ మల్టీస్టారర్ కెరీర్‌కి ‘మహా సంగ్రామం’ శుభం కార్డు పలికింది.ఈ సినిమా చూశాక శోభన్‌బాబు ఫాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు.ఎందుకంటే ఇందులో కృష్ణ క్యారెక్టర్‌ కంటే శోభన్‌బాబు క్యారెక్టర్‌ని తగ్గించి చూపించారు.

కట్ చేస్తే ఇరు హీరోల అభిమానుల మధ్య ఓ పెద్ద యుద్ధం జరిగింది.శోభన్‌బాబు కూడా తనకు తక్కువ ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ ఇచ్చినందుకుగాను పరుచూరి బ్రదర్స్‌ని చంపేస్తానని అన్నారట.

ఈ విషయాన్ని ఓ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు.మహా సంగ్రామంలో శోభన్‌బాబు మిలటరీ ఆఫీసర్‌గా కనిపించారు.

ఆ క్యారెక్టర్‌లో ఉంటూనే కామెడీ కూడా చేశారు.ఈ విషయం తెలుసుకున్న ఒక మిలటరీ ఆఫీసర్‌ రిలీజ్‌కి ముందే అబ్జెక్షన్ చెప్పారు.

ఆ కారణంగా సెన్సార్‌లో శోభన్‌బాబు క్యారెక్టర్ సీన్లు కట్ చేశారు.అది కావాలని చేయలేదని, అనివార్య కారణాల వల్ల క్యారెక్టర్ని తగ్గించాల్సి వచ్చిందని పరుచూరి బ్రదర్స్‌ ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు.

అయినా సోగ్గాడి ఫ్యాన్స్‌లో ఆగ్రహం చల్లారలేదు.సెన్సార్‌లో కట్‌ అయిందనేది వట్టి అబద్ధమని, కావాలనే తమ హీరో క్యారెక్టర్‌ను తక్కువ చేసి చూపించారని గొడవ చేశారు.

ఇలాంటి గొడవలు మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలని కృష్ణ, శోభన్‌బాబు కలిసి ఏ సినిమా చేయలేదు.

తాజా వార్తలు