ఉదయం 11.45 కి ఏం జరిగింది ? అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ప్రమాదంపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అసలు ఇంతగా ప్రజలు అస్వస్థతకు గురుకావడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రానికి మూడు కిలో మీటర్ల దూరం లో బ్రాండిక్స్ ఇండియా అపెరెల్ సిటీ వుంది.
ఇందుకు గార్మెంట్స్ తో పాటు కొన్ని డ్రగ్ తయారీ పరిశ్రమలు ఉన్నాయి.వీటిలో సీడ్స్ అనే కంపెనీలో పలువురు ఉద్యోగులు వాంతులు వికారానికి గురయునట్టు తేలింది.
విషయం తెలిసిన జిల్లా అధికారులు హుటాహుటిన పలువురి వివిధ ఆసుపత్రులకు తరలించారు.దాదాపు 180 మందికి పైగా అస్వస్తతకు గురికావడం తో అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అయితే అమ్మోనియం గ్యాస్ లీకు అయినప్పుడే ఇలాంటి పరిస్థితులు వుంటాయని తెలుస్తోంది.కాగా మిశ్రమ వాయువులు వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మరో వైపు ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే అనకాపల్లి జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు స్పందించారు అంబులెన్స్ను ఏర్పాటు చేయడంతో వేరువేరు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయ పరిస్థితి నుంచి చాలామంది బయటపడ్డారు.ప్రమాద కారణాలు పై విచారణకు ఆదేశించాము రెండు కంపెనీల్లో ఉద్యోగులు ఎక్కువగా అస్వస్థతకు గురయ్యారు.
ఎక్కడ నుంచి విష వాయువులు వచ్చాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది ఎస్ ఈ జెడ్ లో ప్రమాదాల నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తాం ముందు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే మా ఉద్దేశ్యం అస్వస్థతకు గురైన వారిలో అధిక శాతం కోలుకున్నారు 9 మందికి అనారోగ్య లక్షణాలు వుండటంతో కేజీ హెచ్ కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నాము అని అచ్యుతాపురం ఎస్ సి జెడ్ లో ప్రమాద ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యే కన్నబాబు రాజు.ఎంపి డాక్టర్ సత్యవతి అన్నారు
.






