అది భారీ బడ్జెట్ సినిమా కాదు.పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా నటించలేదు.కానీ ప్రస్తుతం యావత్ భారత దేశాన్ని కదిలిస్తుంది ఆ సినిమా.1990లో కాశ్మీర్లో జరిగిన మారణహోమాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది.ఎంతో మందినీ కన్నీళ్లు పెట్టిస్తోంది ఆ సినిమా.సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఇక ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటుంది ఆ సినిమా ఆ సినిమా ఏదో కాదు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ.
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇక ఇప్పుడు భారీ విజయాన్ని సాధించింది.
అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తుంది.
దాదాపు 200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అనే విధంగానే కనిపిస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ప్రస్తుతం అంతటా చర్చ జరుగుతుంది అని చెప్పాలి.
అయితే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన అభిషేక్ అగర్వాల్ అసలు సిసలైన హైదరాబాదీ.తెలుగులో కూడా స్పష్టంగా మాట్లాడగలరు.విభిన్నమైన సినిమాలను నిర్మించడం లో ఎప్పుడూ ముందుంటారు అభిషేక్ అగర్వాల్.ఇక ఇలాంటి కోవలోనే ఈ సాహసోపేతమైన సినిమాకు పూనుకున్నారు.
సినిమా ప్రస్తుతం సూపర్ హిట్ అయ్యి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయిన నేపథ్యంలో ఈ సినిమా కథను నమ్మి నిర్మించేందుకు ముందుకు వచ్చిన నిర్మాత ఎవరు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇకపోతే ఇటీవల అభిషేక్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో తన సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఈ సినిమా నిర్మాణానికి ముందు దర్శకుడు వివేక్ నేను కలిసి ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని కలిసాము.అప్పట్లో కాశ్మీర్ వాలీ లో ఏం జరిగింది అని తెలుసుకోవడం కోసం యూఎస్ కెనడా సౌత్ ఆఫ్రికా లో మూడు నెలలు ప్రయాణించాము.
ఈ జర్నీ అంత సులువైనది కాదు.ఇక మేము కలిసిన వ్యక్తులు కాశ్మీర్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుని ఎడ్చేశారు.ఇక ఈ సినిమాలో కాశ్మీర్ పండిట్ పాత్రలో నటించిన అనుపమ్ ఖేర్ ప్రతి రోజు సెట్లో భావోద్వేగానికి గురి అయ్యాడు అంటూ అభిషేక్ అగర్వాల్ చెప్పుకొచ్చాడు.