ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న అక్షయ్ కుమార్ సినిమా.. బాయ్ కాట్ చెయ్యాలంటూ?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు అక్షయ్ కుమార్.

 Akshay Kumar's Bachchan Pandey Controversy, Bachchan Pandey,akshay Kumar,boycott-TeluguStop.com

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం సూర్య వంశీ. ఈ సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమా తరువాత వచ్చిన ఆత్రంగి రే సినిమా కూడా ఓటీటీ లో విడుదల అయ్యి మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది.ఇక తాజాగా అక్కి నటించిన సినిమా బచ్చన్ పాండే.

ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.అంతే కాకుండా ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
హీరో అక్షయ్ కుమార్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు.భారీ అంచనాల నడుమ ఈ సినిమా మార్చి 18న విడుదల అయ్యింది.ఈ సినిమా విడుదల అయి ప్రస్తుతం పబ్లిక్ నుంచి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంటోంది.అదేవిధంగా బచ్చన్ పాండే సినిమా విమర్శలను సైతం ఎదుర్కొంటోంది.

#BoycottBachchhanpandey అనే హ్యాష్‌ట్యాగ్‌ సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పాత్ర ప్రజలను హత్య చేసే ఒక హింసాత్మక నేరస్తుడిగా ఉంటుంది.

ఈ సినిమాలోని ఆ పాత్రకు పాండే అనే ఇంటి పేరును ఉపయోగించడంతో వివాదం మొదలైంది.

హిందువులను కించపరిచే విధంగా ఈ పాత్రను చిత్రీకరించారని పలువురు ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సినిమాలో అక్కి తోపాటు జాక్విలిన్ ఫెర్నాండెజ్, కృతి సనన్, అర్షద్ వార్సీ, పంకజ్ త్రిపాఠి, సంజయ్ మిశ్రా, అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ బచ్చన్ పాండే సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండా సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన విషయం అందరికి తెలిసిందే.

ఇదే సినిమా తెలుగులో గద్దల కొండ గణేష్ గా రీమేక్ అయిన విషయం తెలిసిందే.తెలుగులో హీరో వరుణ్ తేజ్ నటించాడు.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube