ఏపీ రాష్ట్రానికి బీజేపీ ( BJP )ఏం చేసిందో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా( Special status ) ఇచ్చిందా? లేక రైల్వేజోన్ ఇచ్చిందా ? పోర్టు నిర్మాణం చేపట్టిందా? కడప స్టీల్ ప్లాంట్ కట్టిందా? ఏం చేసిందని ఆయన నిలదీశారు.అలాగే అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు.

ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారో చంద్రబాబు ప్రజలకు చెప్పాలని మాజీమంత్రి పేర్ని నాని( Perni Nani ) డిమాండ్ చేశారు.అలాగే ఎన్ని పొత్తులతో వచ్చిన రానున్న ఎన్నికల్లో వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.







