గుంటూరు జిల్లాలో బీసీ ఐక్య కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ భేటీలో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, యనమల, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలరని తెలిపారు.కులాల వారీగా విడిపోతే ఏం సాధించలేమన్నారు.
దేశంలో ఎంతమంది బీసీలు ఉన్నారనేది ప్రభుత్వమే తేల్చాలని చెప్పారు.బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు ఉండాలని పేర్కొన్నారు.
చట్టసభల్లో ఉంటేనే నిధులు, విధుల గురించి పోరాటం చేయగలమన్నారు.నిధులు లేక బీసీ కులాలు రోడ్డున పడుతున్నారని తెలిపారు.
బీసీలంటే వెనుకబడిన వర్గాల వాళ్లు కాదు అన్నారు.వెనుకబడిన వర్గంగా ముద్ర వేసుకొని వెనుకబడిపోవద్దని సూచించారు.