టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకత లేదు.ప్రభాస్ ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే.
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్ గా మారాడు.ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 4 లేదా 5 సినిమాలు ఉండగా అవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం.
వాటిలో ఒకటి ఆదిపురుష్.రామాయణం ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు.
ఇందులో రాముడిగా ప్రభాస్ సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించారు.వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సంబందించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు గ్రాఫిక్స్ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి.కానీ ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ప్రభాస్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసే అప్డేట్ ఒక్కటంటే ఒక్కటి రాలేదు.
కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా బయటకు వదలకపోవడంతో అభిమానులు మేకర్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.అయినా కూడా ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చిత్ర బృందం పట్టించుకోవడం లేదు.
అలాగే సినిమాల నుంచి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు.కాగా ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో సలార్ కూడా ఒకటి.దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ డ్రామా ఇది.ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాకు సంబదించిన టీజర్ ను మే నెల ఆఖరిలో విడుదల చేస్తామని గతంలో చిత్రయూనిట్ స్వయంగా ప్రకటించి నప్పటికీ మే తర్వాత జూన్ నెల సైతం అయిపోతోంది.కానీ సలార్ టీజర్ మాత్రం ఇప్పటికి బయటకు రాలేదు.
దీంతో ప్రభాస్ సినిమాల అప్డేట్స్ కోసం ఎదురుచూపులు ఇంకెన్నాళ్లో అర్థంగాక అభిమానులు నిరాశలో మునిగిపోయారు.మరి ఇప్పటికేనా ఆదిపురుష్,సలార్ చిత్రాల మేకర్స్ కాస్త మేల్కొని అప్డేట్స్ ఇస్తారా లేదా అన్నది చూడాలి మరి.