డబుల్ బెడ్రుమ్ ఇండ్లు ఎక్కడ కట్టించినరు?:బీర్ల

గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఇళ్ళ కోసం ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నరు.అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు గ్రామాల్లోకి వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలి.

 Where Are Double Bedroom Houses Built?: Beerla-TeluguStop.com

-బీర్ల అయిలయ్య.

యాదాద్రి జిల్లా:అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి,ఇళ్ళు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఎక్కడ కట్టించారో చూపెట్టాలని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య డిమాండ్ చేశారు.గురువారం బొమ్మలరామరం మండలంలోని మర్యాల, మచన్ పల్లి,నాయకునితండా,కేకేతండా,దేవుని తాండ తదితర గ్రామాల్లో కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో రెండవ రోజు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో గడపగడపకు తిరుగుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం,కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు, రైతులను చేస్తున్న మోసాలను ఆయన ఎండగట్టారు.ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి,మరో కొత్తరకం బూటకపు హామీలతో ప్రజల వద్దకు వస్తాయని,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాష్ట్రంలో మాయమాటలతో అధికారంలోకి వచ్చిన 6టీఆర్ఎస్ పార్టీ ఎనిమిదేళ్లు అయినా ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదని విమర్శించారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్ లో పొందుపరిచిన తొమ్మిది అంశాలను అందుబాటులోకి తెస్తామని,రైతులు పండించిన ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని,రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు.రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని,రైతులకు,కౌలు రైతులకు ఎకరాకు రూ.15వేల పెట్టుబడి సాయం చేస్తామని, ఉపాధి హామీల్లో నమోదు చేసుకున్న భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేల ఆర్థిక సాయం చేస్తామని,పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తామన్నారు.చివరి ఎకరా వరకు నీళ్లందిస్తామని, పండించిన పంటలన్నింటిని మద్దతు ధరతో కొంటామని,పోడు భూముల రైతులకు,అసైన్డ్ భూముల లబ్దిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తాన్నారు.ధరణి పోర్టల్ రద్దు చేస్తామని,సరికొత్త రెవెన్యూ వ్యవస్థ తీసుకోస్తామని,వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకం తెస్తామన్నారు.

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చెప్పారు.

కాంగ్రేస్ లో చేరికలు:ఈ రచ్చబండ కార్యక్రమాల్లో భాగంగా పలు గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు బీర్ల అయిలయ్య తెలిపారు.ఈ కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిర్తి మల్లేష్,మహిళా అధ్యక్షురాలు సునీత, బొమ్మలరామరం సర్పంచ్ రాంపల్లి మహేష్ గౌడ్, హజీపుర్ సర్పంచ్ తిరుమల కవిత వెంకటేష్ గౌడ్, ఎంపీటీసీ ఈదమ్మ,యూత్ కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ అధ్యక్షుడు నందరాజు గౌడ్, బీసీ సెల్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్,ఎస్టీ సెల్ నాయకుడు నర్సింహా నాయక్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,జంగారెడ్డి,ప్రభాకర్ రెడ్డి,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు భాస్కర్ నాయక్, తుర్కపల్లి మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్, ఆలేరు మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, ఆలేరు ఎంపీపీ అశోక్,ఆలేరు మండల ప్రధాన కార్యదర్శి సిరిగిరి సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube