స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరి మొబైల్ లోను తప్పనిసరిగా ఉండే యాప్ ఏదన్నా ఉంది అంటే వాట్సాప్ అని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త కొత్త కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తూ వాళ్ళని విశేషంగా ఆకర్షిస్తూ వస్తుంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా మరొక రెండు కొత్త ఫీచర్లను వాట్సాప్ యూజర్లకు పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.మరి ఆ సరికొత్త ఫీచర్లు ఏంటి.? అవి ఎలా యూజర్లకు ఉపయోగపడతాయో అనే విషయాలు తెలుసుకుందాం.వాట్సాప్ గ్రూప్ చాట్‌లో ఉన్న ఇతరుల అభిప్రాయాలను కూడా తెలుసుకోవడానికి గ్రూప్ పోల్స్ ఫీచర్‌ను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది.
అలాగే ఈ ఫీచర్ తో పాటు లాంగ్వేజ్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్ల వాట్సాప్ బీటాఇన్ఫో తన వెబ్‌సైట్ లో తెలిపింది.మరి ఈ రెండు కొత్త ఫీచర్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం.
వాట్సాప్ గ్రూపుల్లో ఇతరుల అభిప్రాయలను కూడా తెలుసుకోవడానికి పోలింగ్ నిర్వహించేలా ఈ కొత్త ఫీచర్ పనిచేయనుంది. గ్రూప్ చాట్‌లో మెసేజ్ రూపంగా పోలింగ్ నిర్వహిస్తారు.
అయితే ముందుగా పోల్ ను క్రియేట్ చేసేటప్పుడు ఒక ప్రశ్నను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.ఆ తర్వాత గ్రూపులో ఉన్న సభ్యులు ఓటు వేయడానికి మల్టీపుల్ ఆప్షన్స్ ఇవ్వాలి.
వీటిలో ఏదో ఒక సమాధానాన్ని యూజర్ సెలక్ట్ చేసుకొని డాన్ని ఓటు వేయాలి.అయితే ఏ యుజర్ దేనికి ఓటు వేశాడో అనే విషయం ఇతర గ్రూపు సభ్యులు చూడటానికి వీలు లేకుండా ఎండ్ టూ ఎండ్ ఇన్‌క్రిప్షన్ భద్రత కూడా ఉంటుంది.
మెంబర్లు సెలక్ట్ చేసిన ఆప్షన్‌ను బట్టి పోల్ రిజల్ట్స్ అనేవి తెలపడం జరుగుతుంది.

అయితే ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ స్టేజీలోనే ఉన్నట్లు తెలుస్తోంది.ఇకపోతే మరొక సరికొత్త లాంగ్వేజ్ ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది.ఇప్పటివరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే అందుబాటులో ఉన్న తరుణంలో రాబోయే రోజుల్లో ఇతర భాషల్లోనూ యాప్‌ను ఉపయోగించుకునేలా కొత్తగా వాట్సాప్ పరిచయం చేయనున్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ ఫీచర్ అందరికి అందుబాటులోకి ఇప్పుడే రాదు.ముందుగా ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 2.22.9.13 వెర్షన్ వాడే బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.సెట్టింగ్‌లోకెళ్లి యూజర్లకు కావాల్సిన లాంగ్వేజ్‌ను సెలక్ట్ చేసుకునేలా ఈ ఫీచర్ ఉంటుంది.
మరికొద్ది రోజుల్లో ఈ ఫీచర్లు అందరికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.