ప్రపంచ దేశాలకు తన మిస్సైల్స్ ప్రయోగంతో సమాధానం చెప్పే నాలుగడుగుల మూడంగులాల ఓ నియంత కిమ్ జోంగ్ ఉన్.ఉత్తర కొరియాను ఒంటి చెత్తో శాశించే ఆనేత ఇప్పుడు ఒక మాయదారి రోగంతో బాధ పడుతున్నారని ఒక ప్రముఖ పత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది.
అయితే ఎప్పుడూ సైనిక విన్యాసాలు జరిగేటప్పుడు, ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసే టప్పుడు, ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పా ఆయన పెద్దగా బయట కనపడం లేదు.అంతే కాకుండా పలు సందర్భాలలో.
ఆయన మెడ వెనుక ఆపరేషన్ జరిగినట్టు ఒక కట్టు ఉండటం ఆప్పట్లో పెద్ద దుమారం రేపింది.
ఆ తర్వాత ఆయన పెద్దగా బయటకు రాకపోవడంతో.
కిమ్ మరణించాడనే వార్త కూడా వైరల్ అయింది.అయితే వీటిని కండించడానికి కిమ్ స్వయాన బయటకు వచ్చి క్లారిటీ ఇచ్చారు.
అమెరికా లాంటి దేశాన్ని కూడా గడగడ లాడించే కిమ్ ఇప్పుడు మిడ్ లైఫ్ క్రైసిస్ అనే దీర్ఘకాల వ్యాదితో బాధ పడుతున్నారు.అయితే వీటికి డాక్టర్లు ఎన్ని మందులు ఇచ్చినా ఆయన పక్కన పెడుతున్నారని తెలుస్తోంది.
కిమ్ ఈ వ్యాది బారిన పడటానికి ప్రత్యర్థి దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పే కారణమా.? లేక పీఠం కోసం తన చుట్టూ ఉన్న నేతలు అల్లుతున్న ఉచ్చే కారణమా.? అనే విషయాలు అర్థం కావడం లేదు.నిత్యం కొపాగ్నితో రగిలిపోయే కిమ్ ఇప్పుడు చాలా నీరసంగా.
నిత్యం మద్యం మత్తులో ఉంటున్నారట.కిమ్ తన వ్యక్తిగత సిబ్బందిని సైతం పక్కన ఉంచుకోవడం లేదట.
ఇక విదేశాలకు వెళ్లినా కూడా తన వస్తువులు, ఆహారపు అలవాట్లు అవతలి వారికి తెలియకుండా చూసుకుంటూ ఉన్నారు.వీటన్నిటినీ ఉటంకీస్తూ ప్రముఖ పత్రికలు అన్నీ.ఆయనకు వచ్చిన వ్యాధిని చెబుతూ ఉన్నాయి.ఇక ఈ వార్త చూసిన నెటిజన్లు మొత్తం పాపం కిమ్ కు ఎంత కష్టం వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు.