బెంగళూరు( Bengaluru ) నగరవాసులు చాలా క్రియేటివ్ గా ఉంటారు.ఆటో డ్రైవర్ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ క్రియేటివిటీని చూపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు.
కొందరు ఆటోలో ఏకంగా తోటను పెంచితే, మరి కొందరు ఫ్రీ ఫుడ్ అందిస్తూ ఆకట్టుకుంటుంటారు.వాహనాలను కార్లలాగా డిజైన్ చేయడం, విమానం లాగా రూపొందించడం బెంగళూరు వాసులకే చెల్లింది.
తాజాగా బెంగళూరుకి చెందిన మరో ఆటో డ్రైవర్ తన క్రియేటివిటీ తో ఆకట్టుకుంటున్నాడు.ఈ వాహనదారుడు ఆటోలో డ్రైవర్ సీటుకు బదులుగా ఆఫీస్ ఛైర్ అమర్చాడు.
సౌకర్యం కోసం అతడు ఇలా చేసి ఉంటాడు.
ఆఫీసు లాంటి ఈ కుర్చీ చూసి అందులో ప్రయాణిస్తున్న జనాలు ఆశ్చర్యపోతున్నారు.మామూలుగా ఆటోలో డ్రైవర్ కోసం చిన్న సీటు ఉంటుంది.అది వెనక్కు ఆనుకోవడానికి పెద్దగా సౌకర్యవంతంగా ఉండదు.
మెత్తగా కూడా ఉండదు.అందుకే ఈ డ్రైవర్ ఆ సీటు స్థానంలో మెత్తగా, సౌకర్యవంతంగా ఉండే ఆఫీస్ ఛైర్ అమర్చాడు.
అయితే దీనిని ఫోటో తీసి అనుజ్ బన్సాల్ అనే వినియోగదారు ట్విటర్( Twitter )లో పోస్ట్ చేశారు.ఇది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.పీసీ ముందు గంటల తరబడి టైమ్ గడిపే వ్యక్తులు కూడా ఇలాంటి కుర్చీనే వాడుతారని కామెంట్ చేస్తున్నారు.గేమర్స్ కూడా ఇలాంటివే సెలెక్ట్ చేసుకుంటారని ఇంకొందరు అన్నారు.
బహుశా ఈ ఆటో డ్రైవర్ గతంలో గేమర్ అయి ఉంటాడని, అందుకే అలాంటి సీటు ఏర్పాటు చేసుకున్నాడని మరికొందరు సరదాగా కామెంట్లు పెట్టారు.మిగతా వారందరూ దీన్ని చూసి అవాక్కవుతున్నారు.
ఏదేమైనా అతడి క్రియేటివిటీకి హాట్సాఫ్ చెప్పాల్సిందే.