పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలో దారుణం జరిగింది.మండపాకలో యువతిపై వేధింపులను ప్రశ్నించినందుకు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో యువతి అన్న, తండ్రిపై కొందరు కత్తులు, గొడ్డళ్లతో అటాక్ చేశారు.వీరిలో యువతి తండ్రి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







