రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్దికి మరియు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సత్వర చర్యలు తీసుకుంటాం ఆర్.కె. రోజా

సచివాలయం రెండో బ్లాక్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు క్రీడా శాఖల అధికారులతో సమావేశమై ఆయా శాఖలు నిర్వహిస్తున్న కార్యక్రమాల ప్రగతిని సమీక్షించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యూత్ అడ్వాన్సు మెంట్ శాఖ మంత్రి ఆర్.

కె.

రోజా సాహిత్య అకాడమీ, మ్యూజిక్, డ్యాన్సు అకాడమీ, నాటక అకాడమీ, విజ్యువల్ ఆర్ట్సు అకాడమీ, జానపద కళల అకాడమీ, హిస్టరీ అకాడమీ, సైన్సు అండ్ టెక్నాలజీ అకాడమీల చైర్ పర్సన్లు ఈ సమావేశంలో పాల్గొని వారి అకాడమీల ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలను మరియు కార్యాచరణ ప్రణాళిలను మరింత భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం మరింత సహకరించే విధంగా చర్యలు తీసుకుంటామన్న మంత్రి ఆర్.కె.రోజా.రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్దికి మరియు క్రీడలను, క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు సత్వర చర్యలు తీసుకొంటామన్న మంత్రి ఆర్.

కె.రోజా.రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సి.ఎస్.డా.రజత్ బార్గవ,శాప్ ఎం.డి.ప్రభాకర రెడ్డి, సాంస్కృతిక శాఖ సి.ఇ.ఓ.మల్లికార్జున రావు తదితరులతో పాటు పర్యాటక, సాంస్కృతిక, క్రీడ శాఖల అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..
Advertisement

తాజా వార్తలు