తెలంగాణ భవన్ పునాదుల దగ్గర నుంచే లేపేస్తాం.. మంత్రి కోమటిరెడ్డి

కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి( Congress Minister Komatireddy Venkat Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాజీ సీఎం కేసీఆర్( Former CM KCR ) కొడుకుగానే కేటీఆర్ కు గుర్తింపు ఉందని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారనేది అసత్య ప్రచారమని మంత్రి కోమటిరెడ్డి( Minister Komatireddy ) తెలిపారు.ఎన్నికల కోడ్ వలన రైతుబంధు, రుణమాఫీ అమలు కాలేదని పేర్కొన్నారు.

ఎన్నికలు ముగిసిన తరువాత అన్ని హామీలను అమలు చేస్తామని తెలిపారు.పదేళ్ల బీఆర్ఎస్( BRS ) పాలనలో ఎందుకు రుణమాఫీ చేయలేదని ప్రశ్నించారు.

జగన్, కేసీఆర్ కుట్ర వలనే కృష్ణాజలాల పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.ఈ క్రమంలోనే కేసీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి ఛాలెంజ్ చేశారు.

Advertisement

మూడు నెలల్లో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మిగులుతారని తెలిపారు.తెలంగాణభవన్( Telangana Bhavan ) పునాదుల దగ్గర నుంచే లేపేస్తామన్నారు.

ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చేందుకు మీకు ఎన్ని గుండెలని ప్రశ్నించారు.కేసీఆర్ లా రేవంత్ రెడ్డి చిల్లర దందాలు చేయలేదన్న మంత్రి కోమటిరెడ్డి రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ అని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు