హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో మహిళా మోర్చా కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ నాయకురాలు డీకే అరుణ మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించే దిశలో మోదీ పాలన కొనసాగుతోందని చెప్పారు.
భవిష్యత్ లో 33 శాతం రిజర్వేషన్ తో మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు.వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే మహిళలు ఇప్పటి నుంచే గట్టిగా పని చేయాలని తెలిపారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.అదేవిధంగా తెలంగాణలో 12 సీట్లు గెలవబోతున్నామన్న డీకే అరుణ బీజేపీ గెలుపులో నారీ శక్తిని నిరూపించాలని పిలుపునిచ్చారు.







