పాల్వాయి స్రవంతికి సముచిత స్థానం కల్పిస్తాం..: కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీలోకి పాల్వాయి స్రవంతిని స్వాగతిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో మంచి పరిపాలన కోసం పాల్వాయి స్రవంతి పార్టీలో చేరారని పేర్కొన్నారు.

గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి ఎందుకెళ్లారో.? తిరిగి కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్లారో తెలియడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు తెచ్చారో అర్థం కాలేదని చెప్పారు.

పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ అవమానించిందన్నారు.మునుగోడులో కాంగ్రెస్ కు ఎవరూ దిక్కులేనప్పుడు స్రవంతిని నిలబెట్టారన్న మంత్రి కేటీఆర్ ఆమె పోటీ చేసినందుకే కాంగ్రెస్ కు ఆ మాత్రం ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు.

గతంలో రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఒకరికొకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు.రాజగోపాల్ రెడ్డిని ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారని విమర్శించారు.

Advertisement

గౌరవం లేని చోట ఇముడలేకనే స్రవంతి బీఆర్ఎస్ లోకి వచ్చారని తెలిపారు.ఈ క్రమంలోనే ఆమెకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు.

అదేవిధంగా కొత్త, పాత అనే తేడా లేకుండా మునుగోడు బీఆర్ఎస్ నేతలు అంతా కలిసి పని చేయాలని కేటీఆర్ కోరారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు