తెలంగాణ ఎన్నికలను బీజేపీ పార్టీ( BJP ) చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.ఈ క్రమంలో ప్రధాని మోదీ పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణలో బహిరంగ సభలలో పాల్గొని అనేక హామీలు ఇవ్వడం జరిగింది.
అంతేకాదు బీజేపీ పార్టీని గెలిపిస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని స్పష్టం చేశారు.పరిస్థితి ఇలా ఉంటే చార్మినార్ లో అస్సాం సీఎం బీజేపీ నేత హేమంత బిశ్వశర్మ( Himanta Biswasharma ) ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్( Hyderabad ) పేరు మారుస్తామని అన్నారు.

హైదరాబాద్ పేరు భాగ్యనగర్ గా( Bhagyanagar ) మారుస్తామని బిశ్వశర్మ స్పష్టం చేశారు.అంతే కాదు త్వరలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు తీసుకొస్తామని కూడా పేర్కొన్నారు.తెలంగాణలో మార్పు రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి అంటూ హేమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
నవంబర్ 28 ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ కావడంతో తెలంగాణలో జాతీయస్థాయి బీజేపీ నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు.ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ మరోసారి పర్యటించడానికి రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్ లో భారీ ర్యాలీలో మోదీ పాల్గొనేలా తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.







