Water Proof Phones : వాటర్ ప్రూఫ్ ఫోన్లు వచ్చేసాయి.. ఇక ఆ చింత అవసరం లేదు..

సాధారణంగా నీటిలో పడిపోతే ఫోన్ డ్యామేజ్ అయిపోతుంది.కానీ మన ఇండియాలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన కొన్ని మొబైల్ ఫోన్స్ నీటిలో ముంచినా పాడు కావు.

 Water Proof Phones Have Arrived No Need To Worry Anymore , Iphones, Waterproof P-TeluguStop.com

వాటిపై ఇప్పుడు ఒక లుక్కేద్దాం.

యాపిల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌

ఇండియాలో రిలీజ్ అయిన యాపిల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తోంది.

ఇది IP68 రేటింగ్‌తో వాటర్ & డస్ట్‌ నుంచి ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తుంది.ఈ మొబైల్ 6.7 అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 48ఎంపీ+12ఎంపీ+12ఎంపీ సెటప్‌తో వస్తుంది.ఈ ప్రీమియం ఫోన్ సహాయంతో నీటి లోతుల్లోకి వెళ్లి కూడా ఫోటోలు తీసుకోవచ్చు.

వీడియోలు రికార్డ్ చేయవచ్చు.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా వాటర్ ప్రూఫ్ ఫోన్‌గా పనిచేస్తుంది.

కాబట్టి మీరు నీటిలోకి దూకినప్పుడు కూడా ఈ ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.ఈ ఫోన్ కూడా ఐపీ68 రేటింగ్‌తో వాటర్ డస్ట్ రెసిస్టెంట్‌గా వస్తుంది.గెలాక్సీ ఎస్22 అల్ట్రా 6.8 అంగుళాల లార్జ్ డిస్‌ప్లేతో వస్తుంది.

Telugu Apple Iphone, Appleiphone, Samsunggalaxy, Samsung, Waterproof-Latest News

యాపిల్ ఐఫోన్ 14

ఐఫోన్ 14 సిరీస్ బేసిక్ వేరియంట్ యాపిల్ ఐఫోన్ 14 కూడా నీటిలో ముంచినా కూడా పనిచేస్తుంది.ఈ యాపిల్ ఐఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, 12ఎంపీ+12ఎంపీ డ్యూయల్ కెమెరా, ఐపీ68 రేటింగ్‌తో వాటర్ డస్ట్ రెసిస్టెంట్‌గా వస్తుంది.ఈ ఫోన్‌ను కూడా నీటిలో ముంచి ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.

పైన పేర్కొన్న ఫోన్లు కొన్నవారు నీటి వల్ల భయపడాల్సిన అవసరమే ఉండదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube