టిడిపి అధినేత చంద్రబాబు సెంటిమెంట్ రాజకీయానికి తెర తీశారు.తనకు ఇవే చివరి ఎన్నికలని , ఈసారి తమను తప్పకుండా గెలిపించాలంటూ కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీవ్యాప్తంగా రాజకీయ సంచలనం సృష్టించాయి.
తమకు అవకాశం ఇవ్వకపోతే , మళ్లీ టిడిపి అధికారంలోకి రాదు అనే భావంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసిపి మంత్రులు, ఆ పార్టీ కీలక నాయకులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ స్పందన ఎలా ఉన్నా , బిజెపి మాత్రం తెగ ఆనంద పడుతోంది.
ఎప్పటి నుంచో ఏపీలో బలపడేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తున్న, టిడిపి కారణంగానే ఆ పార్టీ బలోపేతం కాలేకపోయింది. టిడిపి బిజెపి పొత్తు కారణంగా తాత్కాలికంగా బిజెపి లబ్ధి పొందినా, అంతిమంగా నష్టపోయిందనే భావన ఆ పార్టీ నాయకులలోను ఉంది.అందుకే 2019 ఎన్నికల నుంచి టిడిపిని దూరం పెట్టారు.2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపితో పొత్తు ఉండదని, జనసేన కూడా టిడిపి తో పొత్తు పెట్టుకోదని, తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని బిజెపి నేతలు ప్రకటించారు.మళ్లీ ఏపీలో వైసీపీని అధికారంలోకి వస్తుందని అనేక సర్వే సంస్థలు తమ నివేదికలను బయటపెట్టిన నేపథ్యంలో, చంద్రబాబు ప్రజల్లో సానుభూతి పొందేందుకు ఇప్పుడు ఎమోషనల్ రాజకీయాన్ని మొదలుపెట్టినట్లుగానే కనిపిస్తున్నారు.

తాము ఎన్నికల్లో గెలవకపోతే రాజకీయాల్లో ఉండననే విధంగా చంద్రబాబు వ్యాఖ్యానించడంపై బీజేపీ లెక్కలు వేసుకుంటుంది.టిడిపి బలహీనమైతే అది తమకు కలిసి వస్తుందని , తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని అంచనా వేస్తోంది.కొద్దిరోజుల క్రితం విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోది బిజెపి బలోపేతం కోసం కీలక సూచనలు చేశారు.
టిడిపి వైపు వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రధాని నరేంద్ర మోది పిలిపించుకుని మరి తమ చేయి దాటకుండా చూసుకున్నారు.

2024 ఎన్నికల్లో టిడిపి ఓటమి చెందితే ఆ స్థానాన్ని తాము భర్తీ చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని బిజెపి లెక్కలు వేసుకుంటుంది.రాజకీయ వ్యూహాల్లో బాగా ఆరి చేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సీరియస్ గానే తీసుకున్నారట.అసలు చంద్రబాబు ఈ ఎమోషనల్ డైలాగ్స్ చెప్పక ముందే టిడిపిని ఒంటరి చేసి, 2024 ఎన్నికల్లోను ఓటమి చెందేలా చేస్తే ఆ పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందని, అప్పుడు బిజెపి, జనసేనకు తిరుగు ఉండదని బిజెపి అగ్ర నేతలు అంచనా వేసుకున్నారట.







