సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారు.ఒకే ఏడాదిలో తన కుటుంబం నుండి ముగ్గురిని కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్నారు.
ఏడాది మొదట్లో అన్నని, ఇటీవలే తల్లిని కోల్పోయి ఒత్తిడిలో ఉన్న మహేష్ కు ఇప్పుడు తండ్రి కూడా మరణించడంతో మరింత దిగులుగా అయ్యాడు.
మంగళవారం తెల్లవారుజాము నుండి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
సినీ దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో టాలీవుడ్ లో విషాదఛాయలు అలుము కున్నాయి.తండ్రి మరణంతో మహేష్ బాబు కూడా తీవ్ర దుఃఖంలో మునిగి పోయారు.
ఈయన మరణంతో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

టాలీవుడ్ స్టార్ హీరోలందరూ తరలి వచ్చి మహేష్ కు దైర్యం తెలిపారు.తెలుగు సినిమా శిఖరం అయినటు వంటి కృష్ణ మరణించడం అనేది తెలుగు ప్రజలందరికి షాక్ అనే చెప్పాలి.మరి ఘట్టమనేని కుటుంబం మొత్తం విషాదంలో ఉంది.
ఇంత విషాదంలో ఉన్న కూడా మహేష్ తన కర్తవ్యాన్ని మాత్రం ఆపడం లేదు.

మహేష్ బాబు ఎప్పటి నుండో తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయిస్తూ వస్తున్నాడు.ఇప్పటికే 1000 కి పైగానే చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయించి తన మంచి మనసు చాటుకున్నాడు.ఇక ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా ఈయన నిన్న మోక్షిత్ సాయి అనే చిన్నారికి మహేష్ ఫౌండేషన్ ద్వారా హార్ట్ ఆపరేషన్ జరిగిందట.
ఈ వార్త తెలిసిన వారంతా ఈయనను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు.ఈయన మంచి మనసుకు ఎప్పుడు మంచే జరగాలని అంతా ఆశిస్తున్నారు.







