ఇండస్ట్రీలో ఒక సినిమా కథ పూర్తి చేసిన తర్వాత ఆ సినిమాలో ఎంపిక చేసిన నటీనటులు కొన్ని కారణాలవల్ల తప్పుకోవడంతో ఆ సినిమాలో ఇతరులకు అవకాశాలు రావడం సర్వసాధారణం ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రేటీలు డిజాస్టర్ సినిమాల నుంచి బయటపడగా, బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా వదులుకొని బాధపడ్డారు.అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని పంచిందో మనకు తెలిసిందే.
ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ పోసాని కృష్ణ మురళి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ అయ్యాయి.
ఈ సినిమాలో పోసాని డైలాగ్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే ఈ సినిమాలో పూరి జగన్నాథ్ ముందుగా పోసాని పాత్రలో పోసానిని కాకుండా పీపుల్ స్టార్ నారాయణమూర్తిని అనుకొని ఈ పాత్ర రాసారట.

అందుకే పోసాని పాత్రకు మూర్తి అనే పేరు కూడా పెట్టారు.ఇక ఈ పాత్రలో నటించడం కోసం పూరీ జగన్నాథ్ ఆర్ నారాయణ మూర్తిని ఎంత బ్రతిమలాడినా కూడా ఈ సినిమాలో నటించనని చెప్పారట.

ఇక ఈ పాత్రలో నటించమని ఎన్టీఆర్ సైతం నారాయణమూర్తి అడిగినప్పటికీ ఆయన చాలా సున్నితంగా ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో నారాయణమూర్తి స్థానంలో పోసాని కృష్ణమురళి నటించారు.ఒకవేళ పోసాని స్థానంలో నారాయణమూర్తి కనుక నటించి ఉంటే ఈ సినిమా మరో లెవల్ లో ఉండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక పోసాని కూడా మూర్తి అనే పాత్రకు వందశాతం న్యాయం చేశారని చెప్పాలి.







