గబ్బర్ సింగ్ రెమ్యూనరేషన్ విషయంలో అలాంటి గొడవలు జరిగాయా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈయనకు ఎంతో మంచి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలపై కాస్త ఫోకస్ తగ్గించి రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు.

 Was There Any Such Tussle Over Gabbar Singhs Remuneration Gabbar Singh,  Remuner-TeluguStop.com

ఇలా రాజకీయాలలో సినిమా ఇండస్ట్రీలోనూ కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి ప్రశ్నించారు.

అయితే ఈయన ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయం గురించి చెప్పకపోయినా తన రెమ్యూనరేషన్ గురించి పలు విషయాలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాకు బడ్జెట్ ఎక్కువ కావటం వల్ల తాను రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలిపారు.అయితే ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ తర్వాత నిర్మాత కొంత మాత్రమే తనకు ఇచ్చారని తెలియజేశారు.మరి గబ్బర్ సింగ్ సినిమా కైనా రెమ్యూనరేషన్ ఫుల్ ఇచ్చారా అంటూ బాలకృష్ణ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు పవన్ సమాధానం చెబుతూ హా ఇచ్చాడు.కానీ తను అనుకున్నంత ఇచ్చాడు నేను అనుకున్నంత ఇవ్వలేదు అంటూ సమాధానం చెప్పారు దీంతో పవన్ అభిమానులు నిర్మాత బండ్ల గణేష్ ను గబ్బర్ సింగ్ సినిమా రెమ్యూనరేషన్ విషయం గురించి నిలదీస్తున్నారు.

గబ్బర్ సింగ్ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో మీకు పవన్ కళ్యాణ్ కు గొడవలు జరిగాయా? మరి తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చావా? మా బాస్ అనుకున్నంత ఇవ్వలేదా బండ్లన్న అంటూ పెద్ద ఎత్తున బండ్ల గణేష్ ను నిలదీస్తూ కామెంట్లు చేస్తున్నారు.అయితే నేటిజన్స్ చేసిన ఈ కామెంట్ల పై బండ్ల గణేష్ స్పందిస్తూ భగవంతుడు అడగడు… భక్తుడు ఇస్తాడు బాగుందా తమ్ముడు అంటూ నేటిజన్స్ చేసిన కామెంట్లకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చినట్టు సమాధానం చెప్పారు.మరి గబ్బర్ సింగ్ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో పవన్ ఎంత ఎక్స్ పెక్ట్ చేశారు బండ్ల గణేష్ ఎంత ఇచ్చారనే విషయం మాత్రం వెల్లడించలేదు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో బండ్ల గణేష్ మంచి లాభాలను కూడా తీసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube