తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు టాప్ హీరో గా చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాడు.అయితే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది.
ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు( Balakrsihna ) చేసిన ప్రతి సినిమా కూడా మంచి కథ తో తెరకెక్కడమే కాకుండా, తనకు ఉన్న పేరుని వస్తున్నాడు.బాలయ్య బోయపాటి కాంబో లో వచ్చిన సినిమాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఇప్పటివరకు వీళ్ల కాంభినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి.ఇక మూడు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో వీళ్ళ కాంబినేషన్ కి తిరుగులేదు అనే పేరు అయితే వచ్చింది.
ఇక ఇది ఇలా ఉంటే సింహా సినిమా( Simha )లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే డాక్టర్ ఎపిసోడ్ లో బాలయ్య రౌడీలా ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది.ఆ సీన్ మొదట బాలయ్య బాబు వద్దన్నాడంట మరి ఓవర్ అవుతుందేమో అని బోయపాటితో( Boyapati Srinu ) చెబితే దానికి బోయపాటి సమాధానం గా ఈ సీను ఉంటేనే మిగతా సీనులకి జస్టిఫికేషన్ అవుతుంది అంటూ బాలయ్యను ఒప్పించే ప్రయత్నం అయితే చేసాడట.
కానీ ఎందుకో బాలయ్య బాబుకి అది నచ్చకపోవడంతో బోయపాటి బాలయ్య ను ఒప్పించి మరి చివరి నిమిషంలో ఈ సీన్ ని సినిమాలో పెట్టించారట.ఇక మొత్తానికైతే సింహా సినిమాకి ఈ సీన్ హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో నాలుగో సినిమా కూడా రాబోతుంది.ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అప్డేట్ ను మరి కొద్ది రోజుల్లో సినిమా యూనిట్ అఫిషియల్ గా తెలియజేయబోతున్నట్టుగా తెలుస్తుంది…
.