Google Apps Play store: ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ డిలీట్ చేయకుంటే అంతే సంగతులు!

ఆండ్రాయిడ్ యూజర్లకు మాల్‌వేర్‌ ముప్పు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది.అందువల్ల యూజర్లు నిత్యం అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.

 Warning To Android Users  If These Apps Are Not Deleted, The Same Thing Will Hap-TeluguStop.com

కాగా వీరు మళ్లీ జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది.ఎందుకంటే ప్రస్తుతం ‘షార్క్ బోట్’ అనే మాల్‌వేర్.

ప్లే స్టోర్‌లోని కొన్ని యాప్స్‌లోకి జొరబడి యూజర్ల డేటాను తస్కరిస్తోంది.ఈ విషయాన్ని గూగుల్ గుర్తించింది.

ఈ యాప్స్‌ను ఎవరూ కూడా ఇన్‌స్టాల్ చేసుకోకూడదని హెచ్చరించింది.గూగుల్ ప్రకారం, షార్క్ బోట్ మాల్‌వేర్ ఎక్స్‌ఫైల్‌ మేనేజర్‌ (X-File Manager), ఫోన్‌ఎయిడ్ (PhoneAID), క్లీనర్‌ (Cleaner), ఫైల్‌వాయోజర్‌ (FileVoyager), బూస్టర్‌ 2.6 (Booster 2.6), లైట్‌ క్లీనర్‌ ఎమ్‌ (LiteCleaner M) అనే ఆరు యాప్‌లలో ఉంది.

ఆల్రెడీ వీటిని ఇన్‌స్టాల్ చేసుకొని ఉంటే వెంటనే డిలీట్ చేసుకోవాలి.ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మాల్‌వేర్ యూజర్ల మొబైల్‌లోకి ఈజీగా ప్రవేశిస్తుంది.తర్వాత హ్యాకర్లకు మీ డేటా అంతా ట్రాన్స్‌ఫర్ చేసేస్తుంది.ఇది చాలా డేంజర్ కాబట్టి జాగ్రత్త పడటం మంచిది.

సాధారణంగా ఫైల్‌ మేనేజ్‌మెంట్‌, ఫోన్‌ క్లీనింగ్ కేటగిరీలకు చెందిన యాప్‌లలో వైరస్‌లు, మాల్వేర్లు ఎక్కువగా ఉంటుంటాయి.అందువల్ల యూజర్లు వీటిని డౌన్‌లోడ్ చేయకుండా జాగ్రత్త పడాలి.

ఒకవేళ వాటిని డౌన్‌లోడ్ చేసుకున్నా డేటాకు సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వకూడదు.ఇచ్చినచో ఆ యాప్‌లకు ఫోన్‌ డేటా యాక్సెస్‌ లభిస్తుంది.

అప్పుడు అందులోని మాల్‌వేర్ యూజర్‌ బ్యాంకింగ్ డీటెయిల్స్, అకౌంట్ లాగిన్ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తుంది.తదనంతరం అవతలివారు మీ అకౌంట్ డీటెయిల్స్ ఉపయోగించి మీ డబ్బంతా కొల్లగొడతారు.

Telugu Android Apps, Google, Google Apps, Malware, Store, Shark-Latest News - Te

ఇప్పటికే ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్న వారు వెంటనే వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేసి, బ్యాంకింగ్‌, ఇతర యాప్‌ల లాగిన్‌, పాస్‌వర్డ్‌ డీటెయిల్స్ మార్చుకోవాల్సి ఉంటుంది.ఈ తరహా హానికరమైన యాప్‌ల బారిన పడకుండా జాగ్రత్త పడేందుకు యాజర్లు ప్లే ప్రొటెక్ట్‌ సర్వీస్‌ ఎనేబుల్‌ చేసుకోవడంతోపాటు, ఆండ్రాయిడ్ యాంటీవైరస్‌ యాప్‌లను డివైజ్‌లో యాక్టివ్‌లో ఉంచుకోవాలని టెక్ నిపుణులు చెప్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube