కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వార్దా నది ఉగ్రరూపాన్ని దాల్చింది.ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి భారీగా వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ క్రమంలో సెంట్రల్ వాటర్ కమిషన్ ఫ్లడ్ మేనేజ్ మెంట్ నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి.కాగా వార్దానది సిర్పూర్ (టి) మండలంలో 162.57 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నట్లు వెల్లడి అయింది.ఈ క్రమంలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
అదేవిధంగా మహారాష్ట్రతో పాటు కొమురం భీం జిల్లా కలెక్టర్ కు పలు సూచనలు చేసింది.