కందుకూరు ప్రమాదంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం

కందుకూరు ప్రమాదంపై వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.చంద్రబాబు వలనే ఎనిమిది మంది చనిపోయారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

ఇరుకు సందులో రోడ్ షో నిర్వహించి ప్రాణాలు తీశారని ఆరోపిస్తున్నారు.చంద్రబాబు సమావేశాలకు జనం స్వచ్ఛందంగా రాకపోవడంతో .తక్కువ మందిని ఎక్కువగా చూపించేందుకు టీడీపీ ప్రయత్నించిందని మండిపడుతున్నారు.చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే తొక్కిసలాట జరిగిందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఘటనపై స్పందించిన టీడీపీ కార్యకర్తల్లో గందరగోళం వలనే తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు.ప్రమాదాన్ని వైసీపీ నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఎదురుదాడికి దిగుతున్నారు.సమావేశాలు పెట్టనివ్వకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటోందన్న టీడీపీ ఇరుకు సందులు, గల్లీ రోడ్లు కావడంతోనే ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

నగ్నంగా పూజ చేస్తే లక్ష్మీదేవి వరిస్తుంది... విద్యార్థినిని మభ్యపెట్టిన కేటుగాళ్లు?
Advertisement

తాజా వార్తలు