ప్రస్తుత స్మార్ట్ యుగంలో మన డేటా సురక్షితం కాదని అందరికీ తెలుసు.ఎంత జాగ్రత్తగా ఉన్నా, మన డేటాను పెద్ద పెద్ద కంపెనీలు దొరకబుచ్చుకుంటున్నాయి.
ఫలితంగా మన యాప్‌ల వినియోగం, మన ప్రయాణాలు, గూగుల్ సెర్చింగ్ వంటివి పెద్ద కంపెనీలకు చేరుతున్నాయి.వాటి నుంచి మనకు యాడ్‌ల రూపంలో ఫోన్ వినియోగించినప్పుడు మనకు పంపుతుంటాయి.
బాగా పెద్ద పెద్ద టెక్ కంపెనీలు మన ఫోన్లను స్నూపింగ్ ఎలా చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే మీకు అవి తెలుసుకోవడానికి ఇక నుంచి పెద్ద కష్టం ఉండదు.ఓ సరికొత్త వెబ్ సైట్ మీ డేటా ఎవరెవరికి వెళ్తుందో తెలియజేస్తుంది.
దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గత వారం గూగుల్ మాజీ ఉద్యోగి ఫెలిక్స్ క్రాస్ సరికొత్త ఆవిష్కరణకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా టెక్ యూజర్లను హెచ్చరించాడు.
కస్టమర్లను ట్రాక్ చేయడానికి యాప్‌ల బ్రౌజర్‌లలో థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లలో కంపెనీలు తరచుగా జావాస్క్రిప్ట్ కోడ్‌ను ఎలా ఇంజెక్ట్ చేస్తాయనే విషయాలు ఆయన తెలిపారు.అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి InAppBrowser.com అనే వెబ్‌సైట్‌ను నిర్మించారు.
ఇది కస్టమర్ల గురించి బిగ్ టెక్ కంపెనీలు ఏమి చూడగలదో అనే ప్రజలకు తెలపడంలో సహాయపడుతుంది.InAppBrowser వినియోగదారులు డేటాను సేకరించే వివిధ పద్ధతులను చూపుతుంది.

ఇది యాప్‌లో వెబ్‌సైట్‌ను తెరవడం ద్వారా మనం ఆ సమాచారం తెలుసుకోవచ్చు.ఈ వెబ్‌సైట్‌ను వినియోగించడం చాలా సులువు.మీకు నచ్చిన యాప్‌లో https://inappbrowser.com/ని కాపీ చేసి పేస్ట్ చేయండి.లింక్‌ను ఎవరికైనా DMగా పంపించి, మీరు దాన్ని మీరు ఉపయోగించే యాప్‌లలో ఓపెన్ చేయడానికి మీకు యాక్సెస్ అందిస్తుంది.మీ డేటాను ట్రాక్ చేసే టెక్ కంపెనీలు, యాప్‌ల గురించి చర్చ పెరుగుతున్న కొద్దీ, టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి యాప్‌లు మీ అనుమతి లేకుండా చిరునామా, పాస్‌వర్డ్‌లు మరియు క్రెడిట్ కార్డ్ సమాచారంతో సహా మీ సున్నితమైన డేటాను ఎలా చూడవచ్చో ఈ వెబ్‌సైట్ తెలియజేస్తుంది.