Nausha Electric Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? రూ.35 వేలలో ఇది ట్రై చేయండి!

పెట్రోల్, డీసెల్ ధరలు ఆకాశాన్నంటడంతో సగటు మధ్య తరగతి వాళ్ళు బైక్స్ తీయడానికే భయపడాల్సిన పరిస్థితి.దాంతో దేశంలో మునిపెన్నడూ లేని విధంగా ఎలక్ట్రిక్ బైక్స్ హవా కొనసాగుతోంది.

 Want To Buy An Electric Scooter Try It For Rs.35 Thousand , Electric Scooter, 3-TeluguStop.com

అనేకమంది ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు.ఈ మధ్యకాలంలో కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.

అయితే వీటి ధరలు కూడా దాదాపు పెట్రోల్ వాహనాల మాదిరిగానే ఖర్చుతో కూడుకున్నవి.ఇక బడ్జెట్లో కావాలంటే వెతుక్కోవలసిన పరిస్థితి.

ప్రస్తుతం మార్కెట్లో అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో కలదు.అందరూ కొనే విధంగా కేవలం రూ.35 వేల బడ్జెట్‌లోనే ఒక కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేసి ఔరా అనిపించింది.తాజాగా నౌషా ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త ఈవీని తయారు చేసింది.దీన్ని ధర కేవలం రూ.35 వేలు మాత్రమే అని చెబుతున్నారు.దీంతో చాలా మందికి ఈ స్కూటర్ అందుబాటు ధరకే లభించనుంది.తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి.

Telugu Thousand, Ups-Latest News - Telugu

ఇకపోతే నౌషా ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా మోటార్‌ సైకిల్ కంపెనీ కాదు.ఇది ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలను దిగుమతి చేసుకొని, వాటి ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను రూపొందించడం విశేషం.కాగా నౌషా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేయడానికి తొలిగా రూ.40 వేలు ఖర్చు అయ్యింది.అయితే తర్వాత దీన్ని రూ.35 వేలకే తయారు చేసి అవాక్కయేలా చేసారు.దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి ఈ వెహికల్‌కు పలు ఆర్డర్లు కూడా లభించాయని తయారీదారులు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.ప్రస్తుతానికి ఈ వెహికల్ కొనుగోలుకు అందుబాటులో లేదు.త్వరలోనే వీటి అమ్మకాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube