తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి కాగా మెగా అభిమానులు మాత్రం వాల్తేరు వీరయ్య సినిమాతో తమకు సంక్రాంతి పండుగ రాబోతుందని భావిస్తున్నారు.అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
ఊరమాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం గ్యారంటీ అని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా బాబీ సినిమాలు అంటే మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉంటూనే కామెడీ సీన్లు కూడా ఉంటాయి.
ఈ సినిమాలో కూడా కామెడీ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని సెన్సార్ సభ్యుల నుంచి తెలుస్తోంది.చిరంజీవి శృతి కాంబో సీన్లు మామూలుగా ఉండవని వీళ్లిద్దరి మధ్య ఉండే కామెడీ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఉంటుందని తెలుస్తోంది.
శృతి కామెడీ టైమింగ్ కూడా సినిమాకు ప్లస్ అయిందని సమాచారం.

సెకండాఫ్ కు ఎమోషనల్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని చిరంజీవి రవితేజ మధ్య బాండింగ్ ను బాబీ అద్భుతంగా చూపించారని తెలుస్తోంది.యూ/ఏ సర్టిఫికెట్ ను ఈ సినిమా సొంతం చేసుకోగా నిజంగానే ఆడియన్స్ కు పూనకాలు వచ్చేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచేలా ఒక్క సన్నివేశం కూడా లేదని సెన్సార్ సభ్యులు వెల్లడిస్తున్నారు.
ఇంటర్వెల్ సీన్ లో మాస్ మహారాజ్ ఎంట్రీ ఉంటుందని సమాచారం.తెలుగు రాష్ట్రాల్లో 700కు పైగా థియేటర్లలో వాల్తేరు వీరయ్య రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.
చిరంజీవి డ్యాన్స్ మూమెంట్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది.వాల్తేరు వీరయ్య ఫస్ట్ రివ్యూ పాజిటివ్ గా ఉండటంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
వాల్తేరు వీరయ్య సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.








