మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆచార్య ప్లాప్ ను మరిపించే విధంగా హిట్ అందుకున్నాడు.దీంతో రెట్టించిన ఉత్సాహంతో మరో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు.
ప్రెజెంట్ చిరంజీవి చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి.బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ దాదాపు పూర్తి అయ్యింది.
ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.ఈ సినిమాలో చిరు మాత్రమే కాదు మాస్ రాజా రవితేజ కూడా కీలక రోల్ ప్లే చేస్తున్నాడు.రవితేజ, మెగాస్టార్ కలిసి నటిస్తుండడంతో ఇది మల్టీ స్టారర్ మూవీగా ప్రేక్షకులు భావిస్తున్నారు.చాలా రోజుల తర్వాత చిరు, రవితేజ కాంబోలో సినిమా రాబోతుండడంతో మరింత ఆసక్తిగా మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, టీజర్స్, ఫస్ట్ సింగిల్ బాగా అలరించాయి.
అయితే తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.ఇప్పటికే వచ్చిన ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ సాంగ్ అదిరే లెవల్ లో ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ కూడా రాబోతుందట.ఈ వారాంతంలోనే సెకండ్ సాంగ్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందట.మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.చూడాలి సంక్రాంతి పండుగను ఈ సినిమా ఎలా క్యాష్ చేసుకుంటుందో.