స్మార్ట్ ఫోన్స్ సర్వత్రా రాజ్యమేలుతున్నాయి.దాంతో సహజంగానే సోషల్ మీడియా వినియోగం పెరిగింది.ఇంకేముంది… కట్ చేస్తే దేశంలో నలుమూలలా వున్న టాలెంట్ పీపుల్ లైం లైట్లోకి వస్తున్నారు.అవును, మనదగ్గర టాలెంట్‌కు ఎలాంటి కొదవ లేదు.
కానీ నిన్న మొన్నటివరకు సరియైన మాధ్యమాలు లేకపోవడంతో చాలా టాలెంట్ పీపుల్ చీకటిలోనే మగ్గిపోయేవారు.కానీ నేడు అలా కాదు… సోషల్ మీడియా వలన ఎంతోమంది ప్రతిభ వెలుగు చూస్తోంది.
నేడు దానికి ఉదాహరణగా ఓ వీడియో నిలుస్తోంది.
అవును, మహాబలేశ్వర్ వీధుల్లో ఓ మహిళ లతా మంగేష్కర్ ఆలపించిన “సునో సజ్నా పపిహె నే”ను అంతే అద్భుతంగా పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.
కాగా ఆ పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ముఖ్యంగా సంగీత ప్రియులను ఈ వీడియో తీవ్రస్థాయిలో ఆకట్టుకుంటోంది.ఈ వైరల్ వీడియోను సయ్యద్ సల్మాన్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా వెలుగు చూసింది.

ఈ షార్ట్ వీడియోని గమనిస్తే సదరు మహిళ 1966లో విడుదలైన “ఆయే దిన్ బహర్ కే” మూవీ నుంచి లతాజీ పాడిన పాటను తనదైన శైలిలో ఆలపిస్తున్న వైనాన్ని మనం గుర్తించవచ్చు.ఆమె గొంతులో ఈ పాట మరింత శ్రావ్యంగా వినిపిస్తోందని కొంతమంది నెటిజన్ ఔత్సాహికులు ప్రశంసిస్తున్నారు.మహాబలేశ్వర్‌లోని పంచ్‌గని సమీపంలోని పార్శీ పాయింట్ వద్ద మహిళ ఈ పాట పాడటం మనం వీడియోలో చూడవచ్చు.
ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 7 లక్షల మంది పైగా వీక్షించగా కామెంట్ సెక్షన్‌లో మహిళ ప్రతిభను పలువురు మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.







