విక్టరీ వెంకటేష్ ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలువురి హీరోలతో మల్టీస్టారర్ చిత్రంలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన కుమారుడు రానాతో కలిసి వెంకటేష్ రానా నాయుడు అనే వెబ్ సిరీస్ ద్వారా మొదటిసారిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అయితే ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ మనకు తెలియదు.తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన కీలక అప్డేట్ విడుదల చేశారు.
ఈ వెబ్ సిరీస్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుందని త్వరలోనే ట్రైలర్ విడుదల చేయడమే కాకుండా ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు.ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ లో నటించిన నటీనటులు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఫొటోలను రానా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రానా నాయుడు షూటింగ్ పూర్తి అయినట్లు వెల్లడించారు.
ఈ క్రమంలోనే రానా చేస్తున్న ఈ పోస్టుపై వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత స్పందించారు.
విదేశాలలో నివసిస్తున్న ఆశ్రిత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంత, రానా, మిహిక చేసే పోస్టులపై ఆశ్రితా స్పందిస్తూ తన దైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు.
ఈ క్రమంలోనే రానా చేసిన ఈ పోస్ట్ పై ఆశ్రిత స్పందిస్తూ రానా నాయుడు కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నని పేర్కొన్నారు.అదేవిధంగా మరొక పోస్ట్ కి కామెంట్లో లవ్ సింబల్ షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.