తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీగానే ప్లాన్ చేసింది.టిఆర్ఎస్ , బిజెపిలకు దీటుగా తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేసే విషయంపై గత కొంత కాలంగా దృష్టి పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం వరంగల్ రాహుల్ సభ తర్వాత మరింతగా ఈ స్పీడ్ పెంచింది .
నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీని అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలనే విషయం పైన కసరత్తు మొదలు పెట్టింది.దీనిలో భాగంగానే జూన్ 1,2 తేదీల్లో తెలంగాణ కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శిబిర్ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఈ కీలక సమావేశాలు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేకుండానే జరగబోతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు.
ఇది ఇలా ఉంటే నవ సంకల్ప్ సమావేశాలను ఏర్పాటు చేసిన కమిటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చైర్మన్ గా ఉండగా, 33 మంది సభ్యులుగా ఉన్నారు.
వీరి ఆధ్వర్యంలోనే ఈ సమావేశాలు జరగబోతున్నాయి.
దీనికోసం 108 మందిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఏసీ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.
ఉదయపూర్ లో ఏఐసీసీ ఏర్పాటుచేసిన కాంగ్రెస్ సమావేశాలు మాదిరిగానే ఇక్కడ కూడా సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ముఖ్యంగా ఆరు అంశాలపై ఆరు కమిటీలను ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తీసుకుని వాటినే పాలసీ గా అమలు చేయబోతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ కమిటీకి చైర్మన్ బట్టి విక్రమార్క ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ లో చేసిన తీర్మానాలను ఆమోదించడంతో పాటు, రాష్ట్రస్థాయి అంశాలు, సమస్యలపై రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగబోతూ ఉండగా, మొదటిరోజు మొత్తం చర్చ , రెండోరోజు ప్రకటనలు, తీర్మానాలు ఆమోదించే విధంగా ప్లాన్ చేశారు.
.







