సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన సినిమాల గురించి లేటెస్ట్ అప్ డేట్స్ ప్రకటించారు.ఈ మేరకు ‘వ్యూహం’ సినిమాకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.
వ్యూహం చిత్రం పార్ట్ – 1 ను నవంబర్ 10వ తేదీన విడుదల కానుందని ఆర్జీవీ తెలిపారు.అదేవిధంగా వచ్చే సంవత్సరం జనవరి 25న వ్యూహం పార్ట్ -2 ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఈనెల 13న వ్యూహం ట్రైలర్ ను రిలీజ్ కాబోతుందని ఆర్జీవీ తెలిపారు.ఇప్పటికే ఈ సినిమాల పోస్టర్లు, టీజర్లు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
దివంగత నేత వైఎస్ఆర్ మరణం తరువాత చోటు చేసుకున్న పరిస్థితులు, వైఎస్ జగన్ పై కేసులు, కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ ముఖ్యమంత్రిగా ఎదిగడాన్ని ఆర్జీవీ ఈ చిత్రాలలో చూపించారన్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాలో జగన్ పాత్రంలో అజ్మల్ నటించగా భారతి పాత్రలో మానస నటించారు.







